టీనేజ్ కూతురి కోసం ఆలియా స్పెషల్ సర్ప్రైజ్!

ఆలియా భట్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయింది.;

Update: 2025-10-03 10:30 GMT

ఆలియా భట్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయింది. బాలీవుడ్ లో నేచురల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఆలియా భట్.. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు దక్కించుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే 2022లో ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ తో ఏడడుగులు వేసిన ఈమె.. అదే ఏడాది నవంబర్లో పండంటి కూతురికి కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

కూతురిపై అపారమైన ప్రేమ..

పాపకి రాహా అంటూ నామకరణం కూడా చేశారు. అలియా భట్ , రణబీర్ కపూర్ తమ కూతురు విషయంలో ఎంతలా ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాప పుట్టిన తర్వాతే తమ జీవితం ఎంతో మారిపోయిందని సమయం వచ్చినప్పుడల్లా రాహా పై ప్రేమ పంచుకుంటూనే ఉంటుంది ఈ జంట. పాప సంరక్షణ కోసం ఏకంగా సోషల్ మీడియా నుండే పాప ఫోటోలు తొలగించి..పాప గోప్యతను కాపాడుతూ వస్తోంది. అంతేకాదు తమ కూతురి కోసం ఏకంగా 250 కోట్ల విలువచేసే ఒక బంగ్లాను కూడా రాసిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంగ్లాతో దేశ సినీ పరిశ్రమల్లో అత్యంత రిచెస్ట్ కిడ్ గా రాహా గుర్తింపు సొంతం చేసుకుంది . దీని బట్టి చూస్తే ఈ దంపతులకు కూతురుపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.

టీనేజ్ కూతురు కోసం ఆలియా ఇప్పటినుంచే సర్ప్రైజ్ ప్లాన్..

ఇదిలా ఉండగా అలియా భట్ తన కూతురు కోసం చేస్తున్న ఒక పని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా టీనేజ్ లో తన కూతురికి ఆ సర్ప్రైజ్ ఇస్తానని చెప్పడం మరింత సంచలనంగా మారింది అని చెప్పవచ్చు.. మరి ఆలియా భట్ టీనేజ్ లో తనకు కూతురికి ఇవ్వబోయే ఆ సర్ప్రైజ్ ఏంటి? ఇప్పటినుంచే ఆమె ఇలా ప్లాన్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

నెలకో ఈమెయిల్ రాస్తున్నా..

విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ తారలు కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్5లుగా వ్యవహరిస్తున్న టాక్ షో "టూ మచ్". ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్ కి వరుణ్ ధావన్ తో కలిసి ఆలియా హాజరయ్యింది .ఇందులో తన కుమార్తె గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలియా భట్ మాట్లాడుతూ.. "నేను ప్రతి నెల నా కూతురి కోసం పుట్టినరోజు నుంచి నెలకో ఈమెయిల్ రాస్తున్నాను. ఆ నెలలో తీసిన చిత్రాలు , రాహా చేసిన అల్లరి పనులు అన్నింటిని అందులో రాసి దాచి పెడుతున్నాను. వీటికి ఒక చిన్న కొటేషన్ కూడా యాడ్ చేస్తున్నాను. రాహాకి 18 ఏళ్ళు వచ్చాక.. సర్ప్రైజ్ గా దీనిని బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నా.. ఒకవేళ తాను అడిగితే 14 ఏళ్లకే ఆ సర్ప్రైజ్ ఇస్తాను" అంటూ తెలిపింది.

ఆ ఆలోచన రావడానికి కారణం?

అయితే తనకు ఈ ఆలోచన రావడానికి కారణం తన స్నేహితురాలు అని.. ఎవరో తమ బిడ్డ కోసం ఇలా చేశారని తన స్నేహితురాలు చెప్పిందట. అయితే వాళ్ళు తమ బిడ్డ కోసం ప్రతి రోజు ఉత్తరాలు రాసేవారట. దాంతో తనకు ఈ ఆలోచన నచ్చి, తాను ప్రతి రోజు కాకుండా రాహా పుట్టినప్పటి నుంచి నెలకో ఈమెయిల్ రాస్తున్నాను అంటూ తెలిపింది. మొత్తానికైతే తన కూతురికి ఇవ్వబోయే ఈ సర్ప్రైజ్ ఆలోచన విని ట్వింకిల్ తోపాటు వరుణ్ ధావన్ , కాజోల్ కూడా ఆమెపై ప్రశంసలు కురిపించారు.

Tags:    

Similar News