అలియా భట్ కూతురు డాక్టర్..యాక్టర్ కాదు!
కపూర్ ఖాందాన్ వారసురాలు అంటే కచ్చితంగా వెండితెరపై నటిగానే అడుగుపెడుతుందని అందరూ భావిస్తారు.;
కపూర్ ఖాందాన్ వారసురాలు అంటే కచ్చితంగా వెండితెరపై నటిగానే అడుగుపెడుతుందని అందరూ భావిస్తారు. ఆ కుటుంబంలో తరం మారినా నటనపై ఉన్న మక్కువ మాత్రం తగ్గలేదు. అయితే అలియా భట్ మాత్రం తన కుమార్తె విషయంలో చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. తన కుమార్తె నటి కావాలని తాను కోరుకోవడం లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా అలియా భట్ మనసులోని మాటను బయటపెట్టింది.` రాహా ఒక గొప్ప అథ్లెట్ లేదా క్రీడాకారిణి కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాహాలో చురుకుదనం, క్వాలిటీలను చూస్తుంటే క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలని అలియా భావిస్తున్నారు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారసులను చిన్నప్పటి నుండి గ్లామర్ ప్రపంచానికి అలవాటు చేస్తారు. కానీ అలియా మాత్రం తన కూతురు మైదానంలో చెమట చిందిస్తూ దేశానికి పేరు తీసుకురావాలని కోరుకోవడం విశేషం. నిజానికి కపూర్ కుటుంబంలో ఇతర రంగాల్లో స్థిరపడిన వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. పృథ్వీరాజ్ కపూర్ నుండి నేటి రణబీర్ వరకు అందరూ నటననే వృత్తిగా ఎంచుకున్నారు. రిద్దిమా కపూర్ వంటి కొందరు మాత్రమే డిజైనింగ్ రంగంలోకి వెళ్ళారు. ఇలాంటి నేపథ్యంలో రాహా నటి కావాలని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటే? అలియా మాత్రం ఆమెను స్పోర్ట్స్ స్టార్‌గా చూడాలని కలలు కంటున్నారు.
వృత్తి ఏదైనా అది రాహాకు ఇష్టమైనదై ఉండాలని, నటనను మాత్రమే ఏకైక మార్గంగా ఆమెపై రుద్దకూడదని అలియా గట్టిగా చెబుతున్నారు. అలియా భట్ స్వయంగా తన కెరీర్‌లో ఎన్నో శిఖరాలను అధిరోహించారు. అయినా గ్లామర్ ప్రపంచంలోని ఒత్తిడి , అనిశ్చితి గురించి పూర్తి అవగాహన ఉంది. అందుకే తన కుమార్తె మరింత క్రమశిక్షణతో కూడిన, శారీరక దృఢత్వం అవసరమైన క్రీడా రంగాన్ని ఎంచుకుంటే బాగుంటుందని ఆమె భావిస్తున్నారు. `నేను రాహాను చూసినప్పుడల్లా ఆమెలో ఓ యోధ కనిపిస్తుంది. ఆమె భవిష్యత్తులో ఒలింపియన్ కావాలని కోరుకుంటున్నాను` అని అలియా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రణబీర్ కపూర్ కూడా కుమార్తె విషయంలో ఎంతో గారాబంగా ఉంటారు.
అలియా ఆలోచనలకు ఆయన మద్దతు ఉంటుందా లేదా? అన్నది పక్కన పెడితే రాహా పెరిగి పెద్దయ్యే కొద్దీ తనకంటూ ఒక సొంత మార్గాన్ని ఏర్పరచుకుంటుందని వారు నమ్ముతున్నారు. అలియా కోరుకుంటున్నట్లుగా రాహా క్రీడల్లోకి వెళితే అది కపూర్ కుటుంబ చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయం అవుతుంది. రాహో చిన్నది కదా? అప్పుడే ఇంత డిస్కషన్ దేనికనే సందేహం వస్తుంది. కానీ కెరీర్ విషయంలో ధనవంతులు చిన్న వయసులోనై బమలైన పునాది వేస్తారు. ఆ వయసులో వేసిన పునాదే అత్యంత కీలకమైంది. అందుకే రాహా విషయంలో తల్లిదండ్రులు ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. క్రీడా రంగంలో రాణించాలంటే ఎక్కువగా కష్టపడాలి. సినిమా నటి కావాలంటే ఎంట్రీ వరకూ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది. ఆ తర్వాతైనా ట్యాలెంట్ తోనే బయటకు రావాలి.