• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ ఎంట్రీకి అక్కి...

టాలీవుడ్ ఎంట్రీకి అక్కి భాయ్ రెడీ..!

| బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రీసెంట్ గా సర్ఫిరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

By - Tupaki Desk
Update: 2024-07-14 10:30 GMT

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రీసెంట్ గా సర్ఫిరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూర్య నటించిన సురారై పోట్రు సినిమా రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఐతే ఈ సినిమాకు బాలీవుడ్ ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. బాలీవుడ్ లో ఒకప్పుడు వరుస హిట్లు ఇచ్చిన అక్షయ్ కుమార్ ఇప్పుడు వరుస ఫ్లాపులు చేస్తున్నాడు. ఐతే ఈమధ్య సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ముఖ్యంగా బాలీవుడ్ లో అదరగొట్టేస్తున్న సందర్భంగా అక్షయ్ కుమార్ కూడా సౌత్ సినిమాల మీద గురి పెట్టారు.

రీసెంట్ గా మీడియా ఇంటరాక్షన్ లో అక్కి భాయ్ సౌత్ సినిమాల్లో నటించాలని ఉందన్న విషయాన్ని వెల్లడించారు. అక్షయ్ కుమార్ ఇప్పటివరకు ఏ సౌత్ సినిమాలో నటించలేదు. ఐతే లేటెస్ట్ గా మంచు విష్ణు కన్నప్ప కోసం శివుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఆ సినిమా తర్వాత ఇంకా సౌత్ సినిమాల్లో ఆయన నటించాలని అనుకుంటున్నారు.

అక్షయ్ కుమార్ కి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సౌత్ సినిమాలు చేయాలని అనుకుంటే మాత్రం కచ్చితంగా ఆయన కోసం ఇక్కడ మేకర్స్ డిఫరెంట్ కథలు రాసే ఛాన్స్ ఉంటుంది. కెరీర్ లో ఎప్పుడు ప్రయోగాలకు పెద్ద పీట వేసే అక్కి భాయ్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తే ఇక్కడ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవుతారు.

ఐతే తన సినిమాలు ఫెయిల్ అవుతున్నా ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తుంటాడు అక్షయ్ కుమార్. సినిమాలు కమర్షియల్ సక్సెస్ అంటే కేవలం థియేట్రికల్ కలెక్షన్స్ మాత్రమే కాదు అందుకే అక్షయ్ కుమార్ వరుస ఫ్లాపులు వస్తున్నా సినిమాలు చేస్తున్నారని తెలుస్తుంది. మరి అక్కి భాయ్ తెలుగు ఎంట్రీ ఇస్తే అది ఎలాంటి సినిమా అయ్యుండాలి అంటూ అప్పుడే చర్చలు మొదలు పెట్టారు. అక్షయ్ దూకుడు చూస్తుంటే తెలుగులో సోలో హీరోగా లేదా ఎవరైనా హీరోతో మల్టీస్టారర్ అయినా చేయడానికి సై అనేస్తారని చెప్పొచ్చు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. మరి డైరెక్ట్ గా అక్షయ్ కుమారే మన దగ్గర సినిమాలు చేస్తానంటే మన మేకర్స్ కి ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు.

Tags:    
  • Akshaykumar 
  • Bollywoodhero 
  • Tollywood 
  • Filmindustry 
  • Akshaykumarmovies 
  • Kannappamovie 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS