• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాక్సిక్‌ లో...

టాక్సిక్‌ లో సర్‌ప్రైజింగ్‌ బాలీవుడ్‌ స్టార్‌..!

| ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్‌ ను స్పీడ్‌ గా జరిపి వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

By - Tupaki Desk
Update: 2024-08-14 14:30 GMT

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రాక్‌ స్టార్‌ యశ్‌ ఎట్టకేలకు తన తదుపరి సినిమా ను మొదలు పెట్టాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న టాక్సిక్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇటీవల అధికారికంగా ప్రారంభం అయ్యాయి. రెగ్యులర్‌ షూటింగ్‌ ను కూడా గీతూ మోహన్‌ ప్రారంభించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్‌ ను స్పీడ్‌ గా జరిపి వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ నటించబోతుందని, యశ్‌ కి సోదరి పాత్ర లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి అప్డేట్ ఏమీ లేదు. కానీ తాజాగా మాత్రం బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్‌ ఒబేరాయ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా అక్షయ్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. టాక్సిక్ చిత్ర యూనిట్‌ సభ్యులు తనను టీమ్ లోకి ఆహ్వానిస్తూ పంపిన లేఖ ను అక్షయ్ ఒబేరాయ్ షేర్‌ చేయడం తో పాటు, తాను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అన్నట్లుగా కామెంట్స్‌ చేశాడు.

హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన అక్షయ్‌ ఒబేరాయ్ మొదటి సారి సౌత్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న టాక్సిక్ లో అక్షయ్‌ ఒబేరాయ్ నటించడం అనేది కచ్చితంగా మంచి పరిణామం అని, బాలీవుడ్‌ లో మంచి బిజినెస్ ను ఈ పరిణామం వల్ల పొందవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాక్సిక్ సినిమాకు ఉన్న బజ్ పెంచడంలో ఈ ఎంపిక క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టాక్సిక్ సినిమా షూటింగ్‌ బెంగళూరు లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే సినిమా షూటింగ్‌ కోసం యూనిట్‌ సభ్యులు అంతా విదేశీ ప్రయాణానికి సిద్ధం అవుతున్నారట. గ్యాప్‌ లేకుండా కేవలం ఆరు నెలల్లో సినిమా టాకీ పార్ట్‌ పూర్తి అయ్యే విధంగా ముందస్తు వ్యూహాలను దర్శకురాలు గీతమోహన్‌ దాస్‌ సిద్ధం చేశారనే వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు, వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేయడం ద్వారా యశ్‌ స్థాయి అమాంతం ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగింది. కనుక దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్ టాక్సిక్‌ ను ఎలాంటి కథ మరియు కథనంతో తీయబోతోంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • Bollywood 
  • Kollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • Toxic 
  • AkshayOberoi 
  • Kareenakapoor 
  • GeetuMohandas 
  • Yash 
  • Socialmedia 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS