విష్ణు టాలెంట్ పై బాలీవుడ్ స్టార్ ఎలివేషన్

తాజాగా కన్నప్ప మూవీలో శివుడిగా కనిపించనున్న బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్.. విష్ణుపై ప్రశంసలు కురిపించారు.;

Update: 2025-06-18 09:26 GMT
విష్ణు టాలెంట్ పై బాలీవుడ్ స్టార్ ఎలివేషన్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. భారీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న మూవీ.. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల అవ్వనుంది. అందుకు మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

అదే సమయంలో కొద్ది రోజులుగా సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. సినిమాలో భారీ ఎత్తున క్యాస్టింగ్ ఉండగా.. ఇప్పుడు వారంతా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఆ సమయంలో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తుండగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా కన్నప్ప మూవీలో శివుడిగా కనిపించనున్న బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్.. విష్ణుపై ప్రశంసలు కురిపించారు. ఆయన టాలెంట్ ను కొనియాడారు. అచంచలమైన అంకితభావాన్ని ప్రస్తావించారు. మంచు విష్ణు కన్నప్పలో జీవించేశారని తెలిపారు. సినిమా కోసం ప్రతి విషయంలో మునిగి తేలారని చెప్పారు.

సినిమా విషయంలో ఒక లీడ్ రోల్ లా కాకుండా.. సెట్‌ లో అన్నింటినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళారని పేర్కొన్నారు. ఏ అవసరమైనా ముందుండే వారని చెప్పిన అక్షయ్.. ఒక క్రియేటివ్ డైరెక్టర్ గా విష్ణు కనిపించారని తెలిపారు. ఆరు లేదా ఏడు నిమిషాలు మాత్రమే ఉన్న ఒక ప్రత్యేక సన్నివేశం గురించి కూడా అక్షయ్ కుమార్ ప్రస్తావించారు.

ఆ సీన్ ను వివరించడానికి దాదాపు రెండు గంటలను విష్ణు తీసుకున్నారని తెలిపారు. అప్పటికే సీన్ తనకు అర్థమైందని, కానీ విష్ణు మక్కువను తెలుసుకున్నానని చెప్పారు. సినిమా కోసం శక్తిని, మనసును అర్పించే కొద్ది మంది నటుల్లో ఆయన కూడా ఒకరని ప్రశంసించారు. కన్నప్పను బతికించారని, జీవించేశారని కొనియాడారు.

కాగా సినిమా విషయానికొస్తే.. మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తూ.. మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్, విష్ణు సహా పలువురు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, రఘు బాబు తదితరులు గెస్ట్ రోల్స్ లో సందడి చేయనున్నారు.

Tags:    

Similar News