ఫోన్ లాక్కున్న స్టార్ హీరో.. ఏం జరిగిందో చెప్పిన ఫ్యాన్..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం లండన్ లో ఉన్న విషయం తెలిసిందే.;
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం లండన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తనకు వీడియో తీస్తున్న ఓ అభిమాని ఫోన్ ను లాక్కున్న ఆయన.. అతడిపై ఇటీవల ఫైర్ అయ్యారు. పర్మిషన్ లేకుండా వీడియో తీయొద్దని హెచ్చరించి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆ విషయంపై సదరు అభిమాని రెస్పాండ్ అయ్యారు.
అసలు ఏం జరిగిందో వివరించారు. తానేం చేశానో తెలిపారు. ఆ తర్వాత అక్షయ్ ఏం చేశారు? ఎందుకు చేశారు? అన్నది కూడా చెప్పాడు. ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్ లోని సిగ్నల్ వద్ద నిలబడి ఉన్నప్పుడు తాను మొదట అక్షయ్ ను గుర్తించానని తెలిపాడు. ఆయనో కాదో తెలుసుకునేందుకు కాసేపు అక్షయ్ ను ఫాలో అయ్యానని పేర్కొన్నాడు.
అదే సమయంలో వెనక నుంచి వీడియో తీశానని చెప్పిన అభిమాని.. ముందు నుంచి క్యాప్చర్ చేసినప్పుడు తనను ఆయన చూసినట్లు తెలిపాడు. అప్పుడు దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కున్నారని, డిస్టర్బ్ చేయవద్దని చెప్పినట్లు పేర్కొన్నాడు. వీడియో కూడా రికార్డ్ చేయవద్దని చెప్పినట్లు వెల్లడించారు. అదే మర్యాదకు చెప్పొచ్చు కదా అని తాను అన్నట్లు తెలిపాడు.
వెంటనే 'సారీ బేటా నేను బిజీగా ఉన్నాను' అని అక్షయ్ చెప్పినట్లు అభిమాని తెలిపాడు. ఆ తర్వాత ఫోన్ ఇవ్వమని అడగ్గా, ఇచ్చేశారని చెప్పాడు. అంతే కాదు.. కూల్ అయ్యి తన గురించి అడిగినట్లు చెప్పిన అతడు.. సెల్ఫీకి ఓకే చెప్పారని పేర్కొన్నాడు. ఆయన నిజంగా చాలా మంచి వ్యక్తి అంటూ అక్షయ్ పై ప్రశంసలు కురిపించాడు.
అయితే ఫోన్ లాక్కున్న వీడియో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు అక్షయ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. మరికొందరు మాత్రం సెలబ్రిటీలకు కాస్త ఫ్రైవసీ ఇవ్వాలని, పర్మిషన్ లేకుండా ఫోటోలు, వీడియోలు తీయడం కరెక్ట్ కాదని కామెంట్లు పెట్టారు. వాటిపై ఆయన ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఇంతలో సదరు అభిమాని క్లారిటీ ఇచ్చాడు.
ఇక అక్షయ్ అప్ కమింగ్ మూవీస్ విషయానికొస్తే.. ఇటీవల హౌస్ ఫుల్ 5 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. రీసెంట్ గా మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో శివునిగా కనిపించి మెప్పించారు. ఇప్పుడు భూత్ బంగ్లా, వెల్కమ్ టు ది జంగిల్, జాలీ ఎల్ ఎల్‌బి 3, హైవాన్ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సన్ ఆఫ్ సర్దార్ 2తో మరో వారం రోజుల్లో సందడి చేయనున్నారు.