• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG కోసం అకీరా, రమణ...

OG కోసం అకీరా, రమణ గోగుల..!

| నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటిస్తూ.. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-16 09:18 GMT

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరెక్కుతున్న సినిమా OG. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ యాక్షన్ మూవీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటిస్తూ.. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఓజీ కోసం అకీరా నందన్ ను పిలుస్తానని, రమణ గోగులతో ఓ పాట పాడించాలని చూస్తున్నానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ ఏంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే జూనియర్ పవన్ బిగ్ స్క్రీన్ మీదకు రాకముందే, ఇండస్ట్రీకి తీసుకురావడానికి థమన్ ట్రై చేస్తున్నారు. అకీరా పియానో అద్భుతంగా ప్లే చేస్తాడని, 'ఓజీ' కోసం అతన్ని పిలుస్తానని సంగీత దర్శకుడు స్వయంగా చెప్పారు. అకీరా చేతి వేళ్ళు చాలా పెద్దగా ఉంటాయని, పర్ఫెక్ట్ పియానో ప్లే చేసే వ్యక్తిలా ఉంటాడని అన్నారు. రెండు నెలలు తన దగ్గర వర్క్ చేశాడనే విషయాన్ని కూడా వెల్లడించారు.

పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ 'తమ్ముడు', 'బద్రి', 'జానీ', 'అన్నవరం' లాంటి సినిమాలకు కలిసి పనిచేసారు. ఈ సినిమాల రిజల్ట్స్ సంగతి పెడితే, ఇవన్నీ చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ గా నిలిచాయి. సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ స్టైల్ కి తగ్గట్టుగా రమణ గోగుల ట్యూన్స్ కంపోజ్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తారు. పవర్ స్టార్ కి అతని వాయిస్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని నమ్ముతారు. అయితే గత దశాబ్దకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రమణ గోగుల.. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఓ పాట పాడుతున్నారు. ఈ క్రమంలో ఆయనతో OG మూవీలో ఓ సాంగ్ పాడించాలని థమన్ అనుకుంటున్నారు.

‘ఓజీ’ ఒక మంచి గ్యాంగ్‌స్టర్‌ సినిమా అని, తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న పోటీకి మనమిచ్చే సరైన సమాధానంలా ఉంటుందని థమన్ చెప్పారు. ఈ సినిమాలో కొంత జపాన్, కొరియన్‌ బ్యాక్ డ్రాప్ ఉంటుందని.. అందుకే దీనికోసం ఓ కొరియన్‌ మ్యూజిక్‌ టీంతో చేతులు కలపబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, జనవరి నుంచి అప్‌డేట్లు అందిస్తామని వెల్లడించారు. ఇండియాలో ఇంత వరకు ఏ సినిమాకి రానటువంటి ఓపెనింగ్స్‌ పవన్ కళ్యాణ్ మూవీకి వస్తాయని థమన్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ చూసే OG సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, పాపులర్ మ్యూజిక్ కంపోజర్ రమణ గోగుల కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారంటే, ఇది అభిమానులకు మరింత స్పెషల్ గా మారుతుందనడంలో సందేహం లేదు. డీవీవీ ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు మిగిలిన షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని సుజిత్ అండ్ టీం వేచి చూస్తున్నారు.

Tags:    
  • Pawankalyan 
  • OG 
  • OGmovie 
  • Ramanagogula 
  • Akiranandan 
  • Sujeeth 
  • Thaman 
  • Dvvmovies 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS