అఖిల్ ట్రాక్.. ఎంత ఇంపార్టెంట్ అంటే..
అక్కినేని అఖిల్ కెరీర్‌లో చాలా రోజులకు ఒక సాలిడ్ హిట్ పడింది. 'లెనిన్' సినిమా థియేటర్లలో అదరగొట్టి అతని కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.
అక్కినేని అఖిల్ కెరీర్‌లో చాలా రోజులకు ఒక సాలిడ్ హిట్ పడింది. 'లెనిన్' సినిమా థియేటర్లలో అదరగొట్టి అతని కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. 'ఏజెంట్' లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ అఖిల్ మీద మళ్లీ పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది. అయితే ఈ హిట్ ఎంత పెద్దది అనేదాని కంటే, దీని తర్వాత అతను చేయబోయే సినిమా ఏంటనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అఖిల్ కు మొదటి నుంచి ఉన్న పెద్ద మైనస్ ఇదే. ఎంట్రీ సినిమాతోనే పెద్ద షాక్ తగిలింది. తర్వాత వచ్చిన 'హలో', 'మిస్టర్ మజ్ను' కూడా వర్కౌట్ కాలేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' తో కాస్త ఊపిరి పీల్చుకున్నా, వెంటనే 'ఏజెంట్' తో మళ్లీ పాత స్టోరీనే రిపీట్ అయింది. ఒక హిట్ రాగానే ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయడంలో అఖిల్ తడబడుతూనే ఉన్నాడు. ఇప్పుడు 'లెనిన్' తో వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవాలంటే స్క్రిప్ట్ సెలక్షన్ చాలా పక్కాగా ఉండాలి.
'లెనిన్' సినిమా వర్కౌట్ అవ్వడానికి కేవలం యాక్షన్ మాత్రమే కారణం కాదు. అందులోని రూరల్ బ్యాక్ డ్రాప్, అఖిల్ రఫ్ లుక్, లవ్ ట్రాక్ అన్నీ కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ముఖ్యంగా హీరోను అతిగా స్టైలిష్ గా చూపించకుండా, కథకు తగ్గట్టుగా న్యాచురల్ గా ప్రెజెంట్ చేయడం బాగా కలిసొచ్చింది. ఆడియన్స్ కూడా అఖిల్ ను ఇలా కొత్తగా చూడటానికే ఇష్టపడ్డారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంచుకోవడానికి ఇదొక మంచి క్లూ అని చెప్పొచ్చు.
ఇప్పుడు మళ్లీ పాన్ ఇండియా, వందల కోట్ల బడ్జెట్ అంటూ భారీ సెటప్స్ వైపు వెళ్లాల్సిన అవసరం అఖిల్ కు లేదు. క్యారెక్టర్ కు స్కోప్ ఉన్న ఒక సాలిడ్ కథ పడితే చాలు. సినిమా టోన్ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఉండాలి. 'లెనిన్' లాంటి హిట్ తర్వాత వెంటనే ఇంకో సక్సెస్ పడితేనే అఖిల్ కెరీర్ లో కన్సిస్టెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది.
ప్రస్తుతం అఖిల్ కున్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, అతని మీద ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ నుంచి ఉన్న ప్రెజర్ చాలావరకు తగ్గింది. ఈ రిలాక్స్డ్ మూడ్ లో తొందరపడకుండా సరైన కథను ఎంచుకునే ఛాన్స్ దొరికింది. ఫాస్ట్ గా సినిమా అనౌన్స్ చేయడం కంటే, మంచి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. పొరపాటున రాంగ్ స్టెప్ వేస్తే 'లెనిన్' తెచ్చిన హైప్ మొత్తం గాల్లో కలిసిపోతుంది.
అఖిల్ నెక్స్ట్ సినిమా మీద ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ న్యూస్ బయటకు రాలేదు. టైటిల్ ఏంటి, డైరెక్టర్ ఎవరు అనే విషయాల కంటే, ఈసారి అతను ఎలాంటి జానర్ ట్రై చేస్తాడనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. 'లెనిన్' కేవలం ఒక కమ్ బ్యాక్ సినిమా మాత్రమే. దాన్ని కెరీర్ టర్నింగ్ పాయింట్ గా మార్చాల్సింది నెక్స్ట్ సినిమానే. అందుకే ఇప్పుడు అఖిల్ తీసుకోబోయే డెసిషన్ పైనే అందరి కళ్లు ఉన్నాయి.