అఖిల్ నెక్స్ట్.. ఆమె వెళ్లిపోయింది.. ఈమె వచ్చింది!

తెలుగు సినిమాల్లో అవకాశాలు వేగంగా వస్తూ పోతుంటాయి. ఇదే విధంగా బిజీ హీరోయిన్ శ్రీలీల చేతిలో ఉన్న ఓ క్రేజీ ఆఫర్ ఇప్పుడు మరో ఫ్రెష్ ఫేస్ హీరోయిన్ దగ్గరికి వెళ్లింది.;

Update: 2025-06-26 10:32 GMT

తెలుగు సినిమాల్లో అవకాశాలు వేగంగా వస్తూ పోతుంటాయి. ఇదే విధంగా బిజీ హీరోయిన్ శ్రీలీల చేతిలో ఉన్న ఓ క్రేజీ ఆఫర్ ఇప్పుడు మరో ఫ్రెష్ ఫేస్ హీరోయిన్ దగ్గరికి వెళ్లింది. అఖిల్ అక్కినేని హీరోగా నటించబోయే సినిమాలో శ్రీలీలను మొదట హీరోయిన్‌గా ఫిక్స్ చేసినా, అనుకోని షెడ్యూల్ ఇబ్బందుల వల్ల ఆమె వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ఈ పరిస్థితిని సైతం ముందుగానే అర్థం చేసుకున్న నిర్మాతలు వెంటనే నూతన హీరోయిన్ కోసం వెతకడం ప్రారంభించారు. ఇక సినిమా మరేదో కాదు.. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెనిన్ సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కి ముందు టెస్ట్ షూట్ క్యారెక్టర్ డిజైనింగ్ వంటి పనులలో మేకర్స్ పాల్గొన్నారు. ఇక అంతా సవ్యంగా కొనసాగుతోంది అనుకున్న సమయంలో శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా లేటెస్ట్ ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేశారని సమాచారం. ఆమె ప్రస్తుతం రామ్ సరసన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఆమెకు అవకాశం వచ్చిందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు అఖిల్ సరసన కూడా భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఫిక్స్ కావడంతో ఆమెపై హైప్ పెరిగింది.

భాగ్యశ్రీ ఇప్పటివరకు పెద్దగా హిట్స్ అందుకోకపోయిన, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో గ్లామర్ పరంగా బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాతో ఆమె అందానికి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఆమె డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా అనిపించాయి. అందుకే ఫ్రెష్ ఫేస్ కావాలన్న డిమాండ్‌కి కరెక్ట్ ఆప్షన్‌గా భాగ్యశ్రీ ఎంపికయ్యింది.

ఇక శ్రీలీల విషయానికి వస్తే, ఆమె బిజీ షెడ్యూల్ వల్లే కొన్ని ప్రాజెక్టులను మిస్ అవుతోంది. వరుస ఆఫర్లు రావడంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అఖిల్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్‌గా అఖిల్ నెక్స్ట్ మూవీలో భాగ్యశ్రీకి లీడ్ ఛాన్స్ రావడం ఆమె కెరీర్‌కు బూస్ట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే, ఆమె టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ల జాబితాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం.

Tags:    

Similar News