బాలయ్య‌-ప‌వ‌న్ మ‌ధ్య బిగ్ ఫైట్!

ఈ రెండు సినిమాలు ఇదే తేదీకి రిలీజ్ అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఫైట్ త‌ప్ప‌దు. అందులోనూ పాన్ ఇండియాలో కొట్టుకోవాల్సి వ‌స్తుంది.;

Update: 2025-05-26 19:30 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిగ్ వార్ కి తెర తీసారా? బాక్సాఫీస్ వ‌ద్ద ఇద్ద‌రి మ‌ధ్యా కొట్లాట త‌ప్ప‌దా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య 'అఖండ 2' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. 'అఖండ' కు సీక్వెల్ గా రూపొందుతున్న చిత్ర‌మిది. పాన్ ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేసారు.

'అఖండ' పాన్ ఇండియా రిలీజ్ కాక‌పోయినా? హిందుత్వం కాన్సెప్ట్ తో నార్త్ ఆడియ‌న్స్ కి ఏ రేంజ్ లో క‌నెక్ట్ అయ్యార‌న్న‌ది కుంభ‌మేళా సాక్షిగా ప్రూవ్ అయింది. 'అఖండ' పోస్ట‌ర్లు ఉత్త‌రాది రాష్ట్రాల బ‌స్సుల్లో ప్ర‌త్య‌క్ష‌మవ్వ‌డంతో బాలయ్య ఫీవ‌ర్ ఏ రేంజ్ లో ఉంద‌న్న‌ది అర్ద‌మైంది. ఈసినిమా రిలీజ్ తేదీని ప్రారంభోత్స‌వ స‌మ‌యంలో మేక‌ర్స్ ఫిక్స్ చేసారు. సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆ వారంతో పాటు ద‌స‌రా సెల‌వులు కూడా క‌లిసొస్తాయ‌ని టీమ్ అలా ప్లాన్ చేసింది. అయితే అనూహ్యంగా అదే తేదీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'ఓజీ' కూడా తాజాగా రిలీజ్ తేదీ ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబ‌ర్ రేస్ లో ఓజీ అనుకోకుండా వ‌చ్చిన చిత్రం. 25న రిలీజ్ చేస్తే ద‌స‌రా క‌లిసొస్తుంద‌న్న‌ది టీమ్ ప్లాన్. ఈ సినిమా కూడా పాన్ ఇండియాలో భారీ అంచ‌నాల మధ్య రిలీజ్ అవుతుంది.

ఈ రెండు సినిమాలు ఇదే తేదీకి రిలీజ్ అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఫైట్ త‌ప్ప‌దు. అందులోనూ పాన్ ఇండియాలో కొట్టుకోవాల్సి వ‌స్తుంది. బాక్సాఫీస్ వ‌సూళ్ల కంటే ముందే థియేట‌ర్ల కోసం కొట్లాట మొద‌ల వుతుంది. అటుపై రెండు సినిమాల‌కు హిట్ టాక్ వ‌స్తే వసూళ్ల వ‌ద్ద ఫైటింగ్ త‌ప్ప‌దు. మ‌రి వీళ్లిద్ద‌రిలో ఎవ‌రైనా వెన‌క్కి త‌గ్గుతారా? లేక సై అంటే సై అంటూ దూసుకొచ్చేస్తారా? అన్న‌ది తేలాలంటే రెండు నెల‌లు ప‌డుతుంది. రాజ‌కీయంగా ఇద్ద‌రు వేర్వేరు పార్టీలైనా? కూట‌మిగా ఏపీని రూల్ చేస్తున్నారు. మ‌రి ఆ స్నేహం అక్క‌డికే పరిమిత‌మా? సినిమా వ‌ర‌కూ తీసుకొస్తారా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News