అఖండ 2 vs మనశంకర వరప్రసాద్.. బిజినెస్ లో ఎవరి బలమెంత?
డిసెంబర్ 5న విడుదలవుతున్న 'అఖండ 2' సంక్రాంతికి వస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రాలు, వాటి రిలీజ్ డేట్ అడ్వాంటేజ్‌ను వాడుకుంటున్నాయి.;
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు రెండు పండుగల బిజినెస్ బజ్ నడుస్తోంది. నటసింహం బాలకృష్ణ నటించిన 'అఖండ 2' డిసెంబర్ 5న రాబోతుండగా, మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా సంక్రాంతి బరిలో దిగుతోంది. రెండు వేర్వేరు పండుగలకు వస్తున్న ఈ చిత్రాల థియేట్రికల్ బిజినెస్ అంచనాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ బిజినెస్ పోరులో ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు? ఏ సినిమాకు ఎక్కువ డిమాండ్ ఉంది అనేది ఆసక్తికరంగా మారింది.
డిసెంబర్ 5న విడుదలవుతున్న 'అఖండ 2' సంక్రాంతికి వస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రాలు, వాటి రిలీజ్ డేట్ అడ్వాంటేజ్‌ను వాడుకుంటున్నాయి. అఖండ 2 సినిమాకు డిసెంబర్ మొదటి వారం కావడం వల్ల, సింగిల్ రిలీజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అదే చిరంజీవి సినిమాకు, సంక్రాంతి పండుగ సెలవుల అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లపైన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న నమ్మకం వల్లే భారీ స్థాయిలో బిజినెస్ బజ్ పెరిగింది.
మెగాస్టార్ అనిల్.. కాంబినేషన్ బలం
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాకు సంబంధించిన అంచనాలు చూస్తే.. కేవలం ఆంధ్ర బిజినెస్ రేషియోనే 63 కోట్లుగా ఉంది. అలాగే, నైజాం ప్రాంతంలో కూడా ఈ సినిమాకు 45 కోట్లు కోట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి సీజన్‌కు, అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై మెగాస్టార్ వేసిన ఈ ప్లాన్.. ఆంధ్రా ప్రాంతంలో అనూహ్యమైన డిమాండ్‌ను పెంచింది.
బాలయ్య, బోయపాటి ఫార్ములా
మరోవైపు, బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2' సినిమా బిజినెస్ పై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాకు ఆంధ్ర బిజినెస్ రేషియో 54 కోట్లుగా, నైజాంలో 36 కోట్లుగా అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న వస్తున్నప్పటికీ, 'అఖండ' సృష్టించిన రికార్డులు, బోయపాటి మార్క్ మాస్ యాక్షన్పై ఉన్న నమ్మకం వల్లే ఈ రేంజ్ బిజినెస్ అంచనాలు ఉన్నాయి.
ఆంధ్రాలో చిరంజీవి జోరు
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, ఆంధ్ర ప్రాంతంలో చిరంజీవి సినిమాకు (63 కోట్లు) బాలకృష్ణ సినిమా (54 కోట్లు) కంటే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం, అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములా, సంక్రాంతి సీజన్‌కు బాగా నప్పుతుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. అలాగే, నైజాంలో కూడా చిరంజీవి సినిమాకే (45 కోట్లు vs 36 కోట్లు) మెరుగైన అంచనాలు ఉన్నాయి.
ఈ బిజినెస్ అంచనాలు సినిమా విడుదలయ్యే సమయానికి మారే అవకాశం ఉన్నా, ఈ రెండు సినిమాలు కూడా వాటి కాంబినేషన్ క్రేజ్‌ను బలంగా వాడుకుంటున్నాయి. 'మన శంకరవరప్రసాద్ గారు'కు పండుగ సీజన్ అడ్వాంటేజ్ ఉంటే, 'అఖండ 2'కి సోలో రిలీజ్ అడ్వాంటేజ్ ఉంది. మరి ఈ రెండు చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.