క్రిస్మస్ రేసులో బాలయ్య.. 'అఖండ' కొత్త డేట్ ఇదేనా?
నందమూరి అభిమానులు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారు. గురువారం రాత్రి జరగాల్సిన ప్రీమియర్స్ ఆగిపోవడం, ఆ వెంటనే సినిమా వాయిదా పడటం వారికి మింగుడుపడని విషయం.;
నందమూరి అభిమానులు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారు. గురువారం రాత్రి జరగాల్సిన ప్రీమియర్స్ ఆగిపోవడం, ఆ వెంటనే సినిమా వాయిదా పడటం వారికి మింగుడుపడని విషయం. థియేటర్ల వరకు వచ్చి వెనుతిరిగిన ఫ్యాన్స్, అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్ కు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో తెలియక సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు.
సినిమా ఆగిపోవడానికి కారణమైన ఆర్థిక, న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకోవడంలో నిర్మాతలు తలమునకలై ఉన్నారు. ఈరోస్ సంస్థతో ఉన్న వివాదం కోర్టు పరిధిలో ఉండటంతో, అది క్లియర్ అయితే తప్ప ముందడుగు పడదు. అయితే తెర వెనుక చర్చలు మాత్రం స్పీడ్ గానే జరుగుతున్నాయని, త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటామని ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
చాలామంది ఈ వారంలోనే లేదా డిసెంబర్ 12న సినిమా వస్తుందని ఆశపడ్డారు. సమస్య చిన్నదే అయితే వెంటనే రిలీజ్ చేయొచ్చు. కానీ పరిస్థితి చూస్తుంటే ప్రమోషన్స్ కు మళ్లీ టైమ్ తీసుకుని, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలని టీమ్ డిసైడ్ అయినట్లుంది. అందుకే ఈ వారం, వచ్చే వారం కాకుండా కొంచెం గ్యాప్ తీసుకోవడమే బెటర్ అని భావిస్తున్నారట. హడావిడిగా వచ్చి ఇబ్బంది పడటం కంటే, కూల్ గా రావడమే మంచిదని డిసైడ్ అయ్యారు.
పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, 'అఖండ 2: తాండవం' చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ సెలవులు కలిసి వస్తాయి కాబట్టి, ఆ డేట్ అయితేనే సేఫ్ అని భావిస్తున్నారట. అప్పటికి అన్ని లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసుకుని, గ్రాండ్ గా రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. క్రిస్మస్ బరిలో బాలయ్య దిగితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.
ఇప్పటికే డిసెంబర్ 25న చాంపియన్, శంభాల, పతంగ్ లాంటి సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు బాలయ్య ఎంట్రీ ఇస్తే పోటీలో మార్పులు రావచ్చు. మాస్ సినిమాకు పండగ సీజన్ తోడైతే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలిసిందే. ఈ డేట్ ఫిక్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ కు క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ ఒకేసారి వచ్చినట్లే భావించాలి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.