'అఖండ 2'లో ఐటమ్ గాళ్?
నటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ `అఖండ`కు పార్ట్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.;
నటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ `అఖండ`కు పార్ట్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ సినిమాతో బాలయ్య నటవిశ్వరూపాన్ని మరోసారి అభిమానులు చూడబోతున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. వినోదానికి కొదవేమీ ఉండదని బోయపాటి టీమ్ చెబుతోంది. అయితే రొమాన్స్ పార్ట్ కోసం గ్లామరస్ కథానాయికల్ని ఎంపిక చేసుకున్నా కానీ, ఐటమ్ పాటతో మరింత కిక్కు పెంచాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
అంతేకాదు.. ఇప్పటికే ఐటమ్ భామను ఫైనల్ చేసేందుకు బోయపాటి సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్‌ను ఐటమ్ పాట కోసం ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. సంయుక్త ఇప్పటివరకూ మలయాళం, తెలుగులో అగ్ర హీరోల సరసన భారీ చిత్రాల్లో నటించింది. తనదైన అందం, నట ప్రతిభతో మైమరిపించింది. అయితే సంయుక్త రూపం ట్రెడిషనల్ అప్పియరెన్స్ కి ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది.
ఇప్పుడు తన ఇమేజ్‌ని బ్రేక్ చేసి సంయుక్త ఐటమ్ పాటలో నర్తిస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఇటీవల సమంత, తమన్నా ఐటమ్ పాటల్లో నర్తించినా వారికి ఉన్న ఇమేజ్ పూర్తి భిన్నమైనది. గ్లామరస్ క్వీన్స్ గా తొలి నుంచి ఎస్టాబ్లిష్ అయ్యారు. అయితే సంయుక్త మీనన్ గ్లామరస్ హీరోయిన్ ట్యాగ్ కంటే `ట్రెడిషనల్ బ్యూటీ` అన్న ట్యాగ్ తోనే అందరి దృష్టిలో ఉంది. అందుకే ఇప్పుడు బాలయ్య సినిమాలో ప్రత్యేక గీతానికి ఓకే చెబుతుందా? అన్నది వేచి చూడాలి. ఒకవేళ అంగీకరిస్తే, ఆ తర్వాత సంయుక్తకు ఈ తరహా గ్లామర్ ఎలివేషన్ ఉన్న సినిమాల్లోను అవకాశాలు పెరిగే ఛాన్సుంది.