డిసెంబ‌ర్ లో అఖండ‌2?

సినీ ఇండ‌స్ట్రీలో మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల విష‌యం స‌మ‌స్య ఎప్పుడు తీరుతుందో అనేలా త‌య‌రైంది ప‌రిస్థితి.;

Update: 2025-08-25 13:08 GMT

సినీ ఇండ‌స్ట్రీలో మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల విష‌యం స‌మ‌స్య ఎప్పుడు తీరుతుందో అనేలా త‌య‌రైంది ప‌రిస్థితి. రోజురోజుకీ ఈ రిలీజ్ డేట్ల స‌మ‌స్య బాగా ఎక్కువైపోతుంది. పోటీ కార‌ణంగా కొన్ని సినిమాలు కావాల‌ని రేసు నుంచి త‌ప్పుకుంటున్నాయి. దీంతో త‌ర్వాతి డేట్స్ కు షెడ్యూలైన సినిమాల‌కు స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

సెప్టెంబ‌ర్ 25 నుంచి వాయిదా

ఈ నేప‌థ్యంలో ఇప్పుడో భారీ బ‌డ్జెట్ సినిమా వాయిదా ప‌డుతుందని తెలుస్తోంది. ఆ సినిమా మ‌రేదో కాదు, అఖండ‌2 తాండ‌వం. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ కానుంద‌ని అంద‌రికంటే ముందుగా చెప్పారు. ఆ డేట్ ను టార్గెట్ గా పెట్టుకునే షూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమా ముందు చెప్పిన డేట్ కు రావ‌డం క‌ష్ట‌మంటున్నారు.

డిసెంబ‌ర్ లో రిలీజ్?

అఖండ‌2 పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లేట‌వ‌డంతో సినిమా వాయిదా ప‌డుతుంద‌ని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ నుంచి వాయిదా ప‌డి సినిమాను డిసెంబ‌ర్ 4 లేదా డిసెంబ‌ర్ 5 తేదీల్లో ఒక రోజున రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ మ‌ధ్య డిసెంబ‌ర్ లో రిలీజైన సినిమాలు కూడా సెన్సేష‌న్ సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అఖండ సినిమా కూడా డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లోనే రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన విష‌యం అంద‌రికీ తెలుసు.

మ‌రో నెల రోజుల్లో ఓజి

దాంతో పాటూ అదే రోజున ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజి సినిమా కూడా రిలీజ‌వుతుండ‌టంతో ఒకేరోజు రెండు భారీ సినిమాలు రిలీజైతే ఓపెనింగ్స్ పై ఆ ప్ర‌భావం ఉంటుంద‌ని అఖండ‌2 మేక‌ర్స్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ హీరోగా తెర‌కెక్కిన ఓజి సినిమా సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ కానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఓజి మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ను కూడా మొద‌లుపెట్టారు. మ‌రో నెల రోజుల్లో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్న ఓజి సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News