ఆ తప్పు చేయకూడదని డిసైడైన అఖండ2 టీమ్
డివోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బోయపాటి శ్రీను ఈసారి మరిన్ని డివోషనల్ అంశాలను జోడించారట.;
యాక్షన్ సినిమాలంటే టాలీవుడ్ లో గుర్తొచ్చే హీరోల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఆయన సినిమాల్లో ఉండే యాక్షన్, మాస్ అంశాలు ఫ్యాన్స్ కు ఎంత హై ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం బాలయ్య ఒక్కరే యాక్షన్ తో థియేటర్లను షేక్ చేయగలరు. అలాంటి బాలయ్యకు బోయపాటి లాంటి డైరెక్టర్ తోడైతే వచ్చే అవుట్‌పుట్ ఎలా ఉంటుందో ఊహకు అందడం కూడా కష్టమే.
హ్యాట్రిక్ హిట్లు అందుకున్న బాలయ్య- బోయపాటి
ఈ నేపథ్యంలోనే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా, ఆ మూడు సినిమాలూ బాలయ్య ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా సదరు మూవీ లవర్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో ఇప్పుడు అఖండ2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.
అఖండ2పై భారీ అంచనాలు
అఖండ2 మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. అఖండకు సీక్వెల్ కావడం దానికి తోడు బాలయ్య- బోయపాటి కాంబో కావడంతో మొదటినుంచే ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు మరో రెండు నెలలు కూడా లేకపోవడంతో మేకర్స్ దీపావళి నుంచి అఖండ2 ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారట.
నెవర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్స్
డివోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బోయపాటి శ్రీను ఈసారి మరిన్ని డివోషనల్ అంశాలను జోడించారట. అఘోరాలు, వారి శక్తులు, హిమాలయాల్లో వారి ప్రభావంతో పాటూ అఘోరా బాలయ్యకు సంబంధించి మరిన్ని పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ను పెట్టారని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో డిజైన్ చేశారట యాక్షన్ కొరియోగ్రాఫర్లు.
నార్త్ మార్కెట్ పై దృష్టి
నార్త్ ను దృష్టిలో పెట్టుకుని వారిని ఎట్రాక్ట్ చేసే కొన్ని ప్రత్యేక అంశాలను సినిమాలో పెట్టారని అంటున్నారు. అంతేకాదు, ఈసారి అఖండ2 పబ్లిసిటీని నార్త్ లో స్పెషల్ ఫోకస్ చేయనున్నారట. డివోషనల్ సినిమాలను నార్త్ ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆదరిస్తారో తెలిసిందే. అందుకే ఈసారి నార్త్ మార్కెట్ పై దృష్టి పెట్టి వారు కోరుకునే ఎలిమెంట్స్ ను ఉండేలా చూసుకున్నారట. అఖండ టైమ్ లో కేవలం తెలుగు రాష్ట్రాలపైనే ఫోకస్ చేసిన టీమ్, ఈసారి ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకుందట. అందులో భాగంగానే పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ ను చేసి కాంతార, జై హనుమాన్, కార్తికేయ, మిరాయ్ సినిమాలకు దక్కిన ఫలితాన్నే అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 5న పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో మంచి టాక్ వస్తే అఖండ2 రికార్డులు సృష్టించే వీలుంది.