కోలీవుడ్ న‌టుడికి వింత వ్యాధి

ఇలా ప‌లు ప‌నుల‌తో బిజీగా ఉన్న అజిత్ కుమార్ కు ఓ వింత స‌మ‌స్య ఉంద‌ట‌. తానెంత అల‌సిపోయినా నాలుగు గంట‌ల‌కు మించి ప‌డుకోలేన‌ని చెప్తున్నారు అజిత్.;

Update: 2025-10-01 22:30 GMT

కోలీవుడ్ న‌టుడు అజిత్ దారే వేరు అని చాలా సార్లు నిరూపించారు. ఆయ‌న లోకం వేరు. త‌న లోకంలో తానుంటూ ఆ లోకంలో ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు అజిత్. ఆయ‌న చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. మొద‌టి నుంచి యాక్టింగ్ పై ఫోక‌స్ పెట్టి న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజిత్, ఆ మ‌ధ్య ఓ ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీ స్టూడెంట్స్ కు హెలికాప్ట‌ర్ టెస్ట్ పైలైట్ గా, ఎడ్వైజ‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

స్పెయిన్ లో జ‌రిగిన రేసింగ్ లో అజిత్‌కు కాంస్య ప‌త‌కం

అక్క‌డితో అయిపోలేదు, బైక్ రేసుల్లోనూ, కార్ల రేసుల్లోనూ ఆయ‌న‌పెప్పుడూ ముందుంటారు. అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో సొంతంగా పోటీ సంస్థ‌ను స్టార్ట్ చేసిన అజిత్, త‌న టీమ్ తో ఇప్ప‌టికే దుబాయి, బెల్జియం లాంటి దేశాల్లో కార్ రేసుల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచి ప‌లు మెడ‌ల్స్ కూడా గెలిచారు. రీసెంట్ గా స్పెయిన్ లో జ‌రిగిన కార్ రేసింగ్ లో మ‌రోసారి కాంస్య ప‌త‌కాన్ని గెలిచారు అజిత్ కుమార్.

సోష‌ల్ మీడియాతో అద్భుతాలు చేయొచ్చు

ఇలా ప‌లు ప‌నుల‌తో బిజీగా ఉన్న అజిత్ కుమార్ కు ఓ వింత స‌మ‌స్య ఉంద‌ట‌. తానెంత అల‌సిపోయినా నాలుగు గంట‌ల‌కు మించి ప‌డుకోలేన‌ని చెప్తున్నారు అజిత్. త‌న‌కు స్లీపింగ్ డిజార్డర్ ఉంద‌ని, అందుకే అంత ఈజీగా నిద్ర ప‌ట్ట‌ద‌ని అజిత్ చెప్పుకొచ్చారు. సోష‌ల్ మీడియా ద్వారా అద్భుతాలు చేయొచ్చ‌ని చెప్పిన ఆయ‌న ఇంటర్నేష‌న‌ల్ ఆడియ‌న్స్ కూడా ఇండియ‌న్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాల‌ని కోరుతున్నాన‌ని తెలిపారు.

రేసింగ్ లో ఎన్నోసార్లు ప్ర‌మాదాలకు గురైన అజిత్, ఒక‌సారి ఈ రంగంలోకి అడుగుపెట్టాక అవ‌న్నీ చాలా స‌హ‌జ‌మ‌ని, ఏ రేస‌ర్ ను అడిగినా ఇదే మాట చెప్తార‌ని, అయినా రేసింగ్ కోసం త‌యారుచేసే వాహ‌నాలు చాలా సేఫ్టీతో కూడుకున్న‌వ‌ని, డ్రైవ‌ర్ భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకునే వాటిని త‌యారుచేస్తార‌ని, అందుకే రేసింగ్ లో ప్ర‌మాదాలు జ‌రిగినా ప్రాణాల‌కు ఎలాంటి ముప్పు ఉండ‌ద‌ని అజిత్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News