ఒకే ప్రేమ్ లో భాషకో స్టార్!
కోలీవుడ్ స్టార్ అజిత్ నటిస్తోన్న తాజా చిత్రం `డే డెవల్` పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కోలీవుడ్ స్టార్ అజిత్ నటిస్తోన్న తాజా చిత్రం `డే డెవల్` పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరికొత్త టైటిల్ -పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో వివిధ పరిశ్రమలకు చెందిన దిగ్గజ నటులు అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అజిత్ క్రేజ్‌తోనే కాకుండా ఇతర భాషల స్టార్ హీరోల క్యామియో ఎంట్రీలతో సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ భారీ చిత్రంలో టాలీవుడ్ విక్టరీ హీరో వెంకటేష్ ..మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఒకే సినిమాలో భిన్న భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారనే వార్త వెలువడటంతో ప్రాజెక్ట్ పై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. అజిత్ లాంటి స్టార్ హీరో చిత్రంలో వీరంతా అతిథి పాత్రలు చేయడం అనేది గెస్ట్ రోల్స్‌గా మాత్రమే కాకుండా కథను మలుపు తిప్పే కీలకమైన ఎపిసోడ్స్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.
విభిన్న భాషల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో మేకర్స్ అనుసరిస్తున్న మల్టీ-స్టారర్ వ్యూహం ఎంతో తెలివైనదిగా కనిపిస్తోంది. కోలీవుడ్‌లో అజిత్ మాస్ ఇమేజ్, టాలీవుడ్‌లో వెంకటేష్ ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్, మాలీవుడ్‌లో మోహన్ లాల్ లెజెండరీ స్టేటస్ అన్నీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త వండర్స్ సృష్టించడం ఖాయం. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా కథ డిమాండ్ మేరకు పాత్రలను సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ గనుక నిజమైతే స్క్రీన్ పై ముగ్గురు దిగ్గజాలను ఒకేసారి చూసే అరుదైన అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది.
అజిత్ సినిమాల్లో సాధారణంగా మాస్ ఎలివేషన్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లకు కొదవ ఉండదు. అయితే ఈసారి దర్శకుడు యాక్షన్‌తో పాటు విభిన్న ఇండస్ట్రీల స్టార్ల కలయికతో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్‌ను తలపించేలా ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, మోహన్ లాల్ లాంటి సీనియర్ పవర్‌ఫుల్ యాక్టర్స్ ఎంట్రీతో సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఈ కాంబినేషన్ వార్త విన్న అభిమానులు సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ఇలాంటి మల్టీ-ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఒక్క హీరోపైనే భారం వేయకుండా ఇతర భాషల స్టార్లతో సినిమాను రిచ్‌గా మార్చే ట్రెండ్ సక్సెస్ అవుతోంది. అజిత్ `డే డెవిల్` కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేయడం విశేషం. ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక చూస్తుంటే? మేకర్స్ ఏమాత్రం రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.