• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్‌టాక్ : స్టార్‌...

పిక్‌టాక్ : స్టార్‌ హీరోలో ఎంత మార్పు..!

| కోలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ లో ఒక్కడైన అజిత్ లుక్ విషయంలో చాలా విమర్శలు వస్తూ ఉంటాయి.

By - Tupaki Desk
Update: 2024-10-07 10:30 GMT

తమిళ్‌ స్టార్‌ అజిత్‌ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ లో ఒక్కడైన అజిత్ లుక్ విషయంలో చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. కోట్లాది మంది అభిమానం దక్కించుకున్న అజిత్‌ ఎప్పుడూ సింపుల్‌ గా, రియల్‌ లుక్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. తెల్ల గడ్డం, కాస్త ఎక్కువ లావుగా ఉండే ఫిజిక్‌ తోనే అజిత్ సోషల్‌ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లోనూ ఎప్పుడూ కొత్తగా కనిపించకుండా అదే లుక్‌ లో కనిపిస్తూ ఉంటారు. నెరసిన గడ్డం పై ఎప్పుడూ ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్య ఆయన బరువు పెరగడంతో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


సినిమా ఏదైనా, పాత్ర ఏదైనా తన తెల్ల గడ్డం తో కనిపించే అజిత్ ఈ మధ్య కాలంలో తన రూట్‌ మార్చాడు. గడ్డంకు రంగు వేయడం స్టార్ట్‌ చేశారు. అంతే కాకుండా ఫిజిక్ గురించి వస్తున్న విమర్శల నేపథ్యంలో వర్కౌట్స్‌ ప్రారంభించారు. గత రెండు మూడు నెలల్లో అజిత్ లుక్ చాలా మార్చారు. దాదాపు 8 నుంచి 9 కేజీల బరువు అజిత్ తగ్గారు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు సినిమాల్లో అజిత్ నటిస్తున్నారు. ఆ సినిమాల్లో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు తనను తాను కొత్తగా చూపించడం కోసం అజిత్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ బరువు తగ్గుదల అనే టాక్ వినిపిస్తోంది.

అజిత్ న్యూ లుక్ తాజాగా సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. భార్య తో కలిసి హాలీడే ట్రిప్ లో ఉన్న అజిత్‌ తాజా ఫోటోలతో సర్‌ప్రైజ్ చేశారు. ఇంత సన్నగా కనిపించి అజిత్‌ చాలా సంవత్సరాలు అయింది. ఆయన కెరీర్‌ ఆరంభంలో చాలా సన్నగా ఉండేవారు. ఇప్పుడు మాత్రం బరువు పెరిగారు. మళ్లీ బరువు తగ్గడం అనేది చాలా మంచి పరిణామం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో అజిత్‌ న్యూ లుక్ నేపథ్యంలో ఫ్యాన్స్ లో కొత్త చర్చ మొదలు అయింది. తమిళ్ సూపర్ స్టార్‌ గా పేరున్న విజయ్ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల వైపు వెళ్తున్న నేపథ్యంలో ఆ స్థానంను అజిత్‌ భర్తీ చేయబోతున్నారు అనే టాక్‌ వినిపిస్తుంది.

ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అజిత్‌ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా ప్రస్తుతం ఉన్నారు. అదే లుక్ తో త్వరలో రాబోతున్న విదా ముయార్చి, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే విదా ముయార్చి సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయింది. కనుక గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ లో మాత్రం ఇలాగే కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాల్లో అజిత్ ఎలా ఉండబోతున్నాడు అనే చర్చ ప్రముఖంగా జరుగుతోంది. తమిళ్‌ తో పాటు తెలుగు లోనూ ఈ రెండు సినిమాలను భారీ ఎత్తున విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ తెలుగు నిర్మాణ సంస్థ నిర్మిస్తూ ఉండటం విశేషం.

Tags:    
  • Ajith 
  • Goodbadugly 
  • Vidaamuyarchi 
  • Ajithlooks 
  • Mythrimoviemakers 
  • Ajithmovies 
  • Kollywood 
  • Filmindustry 

Similar News

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

Copyright @2026

Powered by Blink CMS