• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మేన‌ల్లుడి కోసం...

మేన‌ల్లుడి కోసం కిక్కిచ్చే న‌ట‌వార‌సురాలిని వెతికి ప‌ట్టుకున్నాడు!

| ఈ చిత్రంలో రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ - దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌న్ నటిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-30 20:30 GMT

భార‌త‌దేశంలోని ఇద్ద‌రు బిగ్గెస్ట్ స్టార్స్ న‌ట‌వార‌సులు ఓ సినిమాలో జంట‌గా న‌టించ‌బోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ - స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా త‌డాని జంట‌గా న‌టిస్తున్న‌ తొలి చిత్రంపై ఇప్పుడు అంద‌రి దృష్టి నిలిచి ఉంది. ఈ సినిమా టైటిల్ 'ఆజాద్'.


అభిషేక్ కపూర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. కొన్ని నెల‌ల పాటు సాగిన‌ నిరీక్షణ తర్వాత, మేకర్స్ అధికారికంగా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌తో కొత్త జంట గురించిన‌ ప్రత్యేక ప్రకటన చేశారు. ఈరోజు (అక్టోబర్ 30న) అజయ్ దేవగన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో 'ఆజాద్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఈ చిత్రంలో రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ - దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌న్ నటిస్తున్నారు. పోస్టర్‌లో గుర్రంపై చురుకైన యువ‌కుడు క‌నిపిస్తున్నాడు. అతడిని ఉత్సాహపరుస్తూ చుట్టూ అనేక చేతులు ఉన్నాయి. ఇందులో హీరో ముఖాన్ని బ‌హిర్గ‌తం చేయ‌లేదు కానీ, ఈ చిత్రం స్నేహం, ప్రేమ‌, ఎమోష‌న్స్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంద‌ని క్యాప్షన్ ద్వారా నిర్ధారన అయింది. ''కహానీ యారీ కీ. కహానీ వఫదారీ కీ. కహానీ #ఆజాద్ కీ!'' అనే అంద‌మైన క్యాప్ష‌న్ ఇచ్చారు. #AzaadTeaser ఈ దీపావళికి ప్రత్యేకంగా థియేట‌ర్ల‌లో ప్రదర్శిత‌మ‌వుతుంది. 2025 జ‌న‌వ‌రిలో థియేట‌ర్ల‌లో ఈ అడ్వెంచ‌ర్ మూవీ రాబోతోంది!'' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ అభిమానులు ''మీ కోసం ప్రతి సినిమా ఎగ్జైటెడ్ సార్!!'' అని దేవ‌గ‌న్ ని ఉద్ధేశించి రాసారు. ''ఇది కూడా అగ్ని అవుతుంది'' అని మ‌రొక‌రు రాయగా, మూడవ అభిమాని 'వావ్ ఆజాద్' అని పేర్కొన్నాడు. దీనికి తోడు చాలామంది అభిమానులు కామెంట్స్ విభాగంలో రెడ్ హార్ట్ - ఫైర్ ఎమోజీలను షేర్ చేసారు.

దర్శకుడు అభిషేక్ కపూర్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రాన్ని అత్యంత‌ భారీ స్థాయిలో రూపొందిస్తామ‌ని గ‌తంలో తెలిపారు. ఈ క‌థ‌లో ఒక యువ నటుడు, సీనియర్ స్టార్ క‌లిసి న‌టిస్తార‌ని అన్నారు. ఆయ‌న ప్ర‌కారం.. అమన్ దేవగన్- అజయ్ దేవగన్ క‌లిసి న‌టిస్తారు. ఇంతకుముందెన్నడూ చూడని అవతార్‌లో అజయ్ దేవగన్‌ని ఈ సినిమాలో చూడ‌బోతున్నారు. ఈ చిత్రంలో సింగం స్టార్ దేవ‌గ‌న్ కోసం ప్రత్యేక లుక్ ని డిజైన్ చేసారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని సోర్స్ చెబుతోంది. మరో సోర్స్ ప్ర‌కారం.. రాషా-అమన్‌లు షూట్‌కు ముందు కొన్ని శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌కు అటెండ‌వుతున్నారు. రోనీ స్క్రూవాలా, ప్రగ్యా కపూర్‌ల స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని అభిషేక్ నయ్యర్- అభిషేక్ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఆర్‌ఎస్‌విపి & గై ఇన్ ది స్కై పిక్చర్స్ బ్యానర్ల‌పై రూపొందిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో థియేటర్లలోకి రానుంది.

Tags:    
  • Bollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • AjayDevgn 
  • AmanDevgn 
  • Azaad 
  • Teaser 
  • TeaserAnnouncement 
  • Socialmedia 
  • Viralpost 
  • Raveenatandon 
  • Rasha 
  • AbhishekKapoor 
  • Abhisheknayyar 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS