• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాక్ష‌న్ కింగ్ అర్జున్...

యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె పెళ్లి అత‌డితో!

| కొంతకాలం డేటింగ్ తర్వాత ఈ జంట త‌మ బంధాన్ని తదుపరి దశకు తీసుకెళుతోంది.

By - Tupaki Desk
Update: 2024-06-05 17:33 GMT

యాక్ష‌న్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్ పెళ్లికూతురు కాబోతోంది. న‌టుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యను జూన్ రెండో వారంలో చెన్నైలో జ‌ర‌గ‌నున్న వేడుక‌లో ఐశ్వ‌ర్య‌ పెళ్లాడ‌నున్నారు. కొంతకాలం డేటింగ్ తర్వాత ఈ జంట త‌మ బంధాన్ని తదుపరి దశకు తీసుకెళుతోంది.

ఈ అందమైన జంట గత ఏడాది అక్టోబర్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు.

అప్ప‌టికి పెళ్లి తేదీపై వివ‌రాలేవీ బ‌య‌ట‌కు రాలేదు కానీ, జూన్ రెండో వారంలో పెళ్లి జరగనుందని సమాచారం. ఒక సోర్స్ ప్ర‌కారం.. ఈ జంట వివాహం చెన్నైలోని హనుమాన్ ఆలయంలో నిశ్చితార్థం జరిగిన అదే ప్రదేశంలో జరుగుతుంది. ఐశ్వర్య, ఉమాపతి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి.

ప‌రిచ‌యం అలా..

బుల్లితెర రియాలిటీ షో `సర్వైవర్‌`లో ఈ జంట మొదటిసారి కలుసుకున్నారు. ఆసక్తికరంగా అర్జున్ సర్జా ఈ రియాలిటీ షోకి హోస్ట్‌. ఐశ్వర్య - ఉమాపతి ఇద్దరూ ఈ వేదిక‌పై అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకున్నారు. అదే క్ర‌మంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం పెరిగింది. మ‌నసులు కూడా క‌లిసాయి. వారి ప్రేమకథలో లెజెండరీ నటుడు అర్జున్ సర్జా మన్మథుడి పాత్ర‌ను పోషించాడ‌ని చెప్పాలి. చివరికి యువ జంట‌ 28 అక్టోబర్ 2023న నిశ్చితార్థం చేసుకున్నారు. వారి నిశ్చితార్థానికి సంబంధించిన‌ అద్భుత‌మైన ఫోటోలు సోషల్ మీడియాల్లో వైర‌ల్ అయ్యాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఐశ్వర్య అర్జున్ 2013లో పట్టతు యానై చిత్రంతో క‌థానాయిక‌గా పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆమె తన తండ్రి అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన తమిళ-కన్నడ ద్విభాషా చిత్రం `ప్రేమ బరహా`లో చివరిగా కనిపించింది. మరోవైపు త‌న‌ కాబోయే భర్త ఉమాపతి `రాజకిలి`తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

వ‌రుడి తండ్రి ఉమాపతి రామయ్య తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. పాపుల‌ర్ తమిళ నటుడు.. దర్శకుడు తంబి రామయ్య కుమారుడు. అతడు తన కెరీర్‌ను `అడగపట్టత్తు మగజనంగలే` చిత్రంతో ప్రారంభించాడు. ఈ చిత్రంలో త‌న నటనకు విమర్శకుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

Tags:    
  • Aishwaryaarjun 
  • Umapathyramaia 
  • Arjundaughter 
  • Filmindustry 
  • Aishwaryaumapathymarriage 
  • Aishwaryaumapathy 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS