స‌క్సెస్ అయితే సెకెండ్ ఇన్నింగ్స్ నెక్స్ట్ లెవ‌ల్!

నటసింహ బాలకృష్ణ చిత్రాలలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో విలన్ పాత్రలు ..బలమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాయి.

Update: 2026-07-25 07:48 GMT

నటసింహ బాలకృష్ణ చిత్రాలలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో విలన్ పాత్రలు ..బలమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాయి. తాజాగా తెలుగు నటి ఐశ్వర్య రాజేష్ బాలయ్య సినిమాలో ఓ నెగెటివ్ రోల్‌లో కనిపించనుందని వార్త‌లొస్తున్నాయి. ఇప్పటి వరకు తనదైన నటనతో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన ఐశ్వ‌ర్యా రాజేష్‌ ఇప్పుడు ఏకంగా నెగెటివ్ షేడ్స్ పాత్ర‌ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ద‌ర్శ‌కుడు కోరటాల శివ రాసిన నెగిటివ్ రోల్ కు ఐశ్వ‌ర్య‌కు ప‌ర్పెక్ట్ గా సూటువుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజాలు తేలాల్సి ఉంది.

సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించి సహజ సిద్ధమైన నటనతో న‌టిగా ఎదిగిన ఐశ్వర్య రాజేష్‌కు ఈ అవ‌కాశం నిజ‌మే అయితే పెద్ద సవాల్ అనే చెప్పాలి. సాధారణంగా హీరోయిన్లు కెరీర్ సెకండ్ హాఫ్‌లో ఇలాంటి ప్రయోగాలు చేయడానికి భయపడుతుంటారు. కానీ కథాబలం ఉంటే ఏ పాత్రనైనా చేయడానికి తాను సిద్ధమని ఐశ్వ‌ర్య‌ నిరూపిం చుకుంటున్నారు. బాలయ్య లాంటి మాస్ హీరో సినిమాలో నెగెటివ్ రోల్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా సినిమాలో కీలకమైన మలుపు తిప్పే పాత్ర అయితే నటనకు పూర్తి స్థాయిలో ఆస్కారం ఉంటుంది.

ఈ సినిమా ఐశ్వ‌ర్య పోషిస్తున్న నెగెటివ్ రోల్ గనుక క్లిక్ అయితే? ఐశ్వర్య రాజేష్ కెరీర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయం. ఇప్పటి వరకూ ఐశ్వ‌ర్యా రాజేష్ పోషించిన గృహిణి ... ఇంటెన్సివ్ లీడ్ రోల్స్ కంటే ఈ పాత్ర ఆమెలోని విభిన్న నటనను బయటకు తీసుకువస్తుంది. టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ విలన్ పాత్రలు చేయడానికి నటీమణులు దొరకని ఈ రోజుల్లో ఐశ్వర్య లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇలాంటి బాధ్యతను తీసుకోవడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే.

ఈ పాత్ర ద్వారా ఐశ్వ‌ర్య‌ టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉంది. తెలుగు తెరపై పవర్ ఫుల్ విలనిజం పండించడానికి ఎంతోమంది సీనియర్ నటీమణులు ప్రయత్నించినా? సరికొత్త తరహా అప్రోచ్‌తో ఐశ్వర్య దీనికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని చెప్పొచ్చు. ఒక స్టార్ హీరో సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కనిపించడం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో సందేహం లేదు. అభిమానులు కూడా ఐశ్వర్య రాజేష్‌ను ఒక సరికొత్త కోణంలో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నటిగా తన పరిధులను విస్తరించుకోవడానికి ఆమె తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో ఇతర నటీమణులకు కూడా స్పూర్తిగా నిలుస్తుంది. `సంక్రాంతికి వ‌స్తున్నాం` సినిమాతో ఐశ్వ‌ర్య రాజేష్ లో అస‌లైన బ‌య‌ట ప‌డింది. ఆమెలో ట్యాలెంట్ ని ప‌క్కాగా వినియోగించుకున్న ద‌ర్శ‌కుల్లో అనీల్ రావిపూడి హైలైట్ అయ్యాడు. అప్ప‌టి వ‌ర‌కూ ఐశ్వ‌ర్య పోషించ‌ని పాత్ర‌లు ఒక ఎత్తైతే? సంక్రాంతి సినిమాలో అమ్మ‌డు పోషించిన పాత్ర మ‌రో ఎత్తులా నిలిచింది. ఆ పాత్ర‌తో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఇండ‌స్ట్రీలో ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News