బ‌న్నీ- అట్లీ కాంబోలో బిగ్ ట్విస్ట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ `రాకా` పై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2026-08-29 13:32 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ `రాకా` పై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ డ్రామాకు సంబంధించి ప్రతీ అప్‌డేట్ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇప్పటికే చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా తాజాగా మరో క్రేజీ కాస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి.

'పొన్నియిన్ సెల్వన్' వంటి పాన్-ఇండియా సినిమాల్లో ప్రశంసనీయ నటనతో మెప్పించిన ఐశ్వర్య 'రాకా'లో కీలకమైన పాత్ర కోసం సంప్రదింపులు జ‌రుపుతున్న‌ట్లు సమాచారం. ఇక్క‌డ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే? ఇందులో ఐశ్వర్య లక్ష్మి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం. ఇప్పటి వరకు పాజిటివ్, గ్లామరస్ పవర్‌ఫుల్ విమెన్ సెంట్రిక్ రోల్స్ చేసిన అమ్మ‌డు తొలిసారిగా పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయ‌డం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే అమ్మ‌డి ఎంట్రీ వెనుక ఈ ప్ర‌చారంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది. ఈ చిత్రంలో ఇప్పటికే దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి ఎంట్రీ ఖరారైతే ఇంతమంది నటీనటుల మధ్య ఐశ్వ‌ర్య నెగటివ్ రోల్ కథను మలుపు తిప్పేలా ఉండబోతోందని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి `సంబరాల ఏటి గట్టు`తో పాటు మలయాళంలో `ఆశ` వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ దశలో `రాకా` లాంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో ప్రతికూల పాత్రను అంగీకరిస్తే అది ఆమె కెరీర్‌కే పెద్ద మలుపుగా మారనుంది.

ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య లక్ష్మి ఎంట్రీ ఖ‌రారైతే? మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి సౌత్ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల జాబితాలో సరికొత్త మైలురాయిని చేరుకుంటారు. సాధారణంగా కథానాయికలు కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ప్రతికూల పాత్రల జోలికి వెళ్లడానికి జంకుతుంటారు. కానీ అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ తన సినిమాల్లో ప్రతినాయక పాత్రలను కూడా శక్తివంతంగా స్టైలిష్‌గా డిజైన్ చేస్తారనే నమ్మకంతోనే ఐశ్వర్య ఈ సాహసోపేతమైన నిర్ణయం వైపుమొగ్గు చూపుతున్నట్లు చెప్పొచ్చు.

Tags:    

Similar News