'సైయారా' హీరో గాళ్ ఫ్రెండ్ కిల్లర్ బ్యూటీ!
ఇదే చిత్రంతో అనీత్ పద్దా కథానాయికగా పరిచయమైంది. అంతకుముందు ఓ వెబ్ సిరీస్ లో నటించిన అనీత్ కి ఇది ఘనమైన పెద్ద తెర ఆరంగేట్రం.;
నటించిన మొదటి చిత్రంతోనే ప్రేమికుడిగా హృదయాలను గెలుచుకున్నాడు అహాన్ పాండే. లైగర్ బ్యూటీ అనన్య పాండే కజిన్ అతడు. చంకీ పాండే (అనన్య తండ్రి) సోదరుడు చింకీ పాండే కుమారుడు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సైయారా చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఇదే చిత్రంతో అనీత్ పద్దా కథానాయికగా పరిచయమైంది. అంతకుముందు ఓ వెబ్ సిరీస్ లో నటించిన అనీత్ కి ఇది ఘనమైన పెద్ద తెర ఆరంగేట్రం.
తెరపై అహాన్- అనీత్ పద్దా జంట కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. అయితే అహాన్ ఆఫ్ ద స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో? అంటే దానికి ఇప్పుడు సమాధానం లభించింది. అతడు ప్రముఖ నటి కం మోడల్ శ్రుతి చౌహాన్ తో ప్రేమలో ఉన్నాడని సమాచారం. శ్రుతి ఇంతకుముందు గల్లీ బోయ్స్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ముంబైలో మోడల్‌గాను రాణిస్తోంది. అహాన్ నటించిన `సైయారా` చిత్రాన్ని సమీక్షించిన శ్రుతి, ఈ ప్రపంచానికి నువ్వేంటో తెలిసింది! అంటూ అహాన్ ని ఆకాశానికెత్తేసింది. చాలా కాలంగా శ్రుతి - అహాన్ స్నేహం గురించి గుసగుసలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రశంసతో ఆ ఇద్దరి మధ్యా రిలేషన్ గురించి కొత్తగా చర్చ మొదలైంది. అహాన్ ఆన్ ద స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ ద స్క్రీన్ రొమాన్స్ లోను అదరగొడుతున్నాడని, అతడి గాళ్ ఫ్రెండ్ చాలా అందంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తమ రిలేషన్ షిప్ గురించి అహాన్ కానీ, శ్రుతి కానీ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు.
శ్రుతి ఎవరు?
జోయా అక్తర్ తెరకెక్కించిన `గల్లీ బాయ్` చిత్రంలో ఆలియా భట్ కథానాయికగా నటించగా, శ్రుతి చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించింది. ఈ బ్యూటీ నటి కం మోడల్ అని తెలుస్తోంది. గల్లీ బోయ్‌లో ఆమె మాయ అనే పాత్రను పోషించింది. శ్రుతి జైపూర్ నుండి ముంబైకి వచ్చి జ్యోతి విద్యాపీఠ్ కళాశాలలో ఆర్ట్స్ చదువుకుంది. గాయకుడు జుబిన్ నౌటియల్ తో కలిసి `హద్ సే` అనే మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. ఈ భామ ఇన్‌స్టాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ వేదికపై 223కె ఫాలోవర్లు ఉన్నారు. ఖుషీ కపూర్, అలయ ఎఫ్, పాలక్ తివారీ, ఇషాన్ ఖత్తర్, అనన్య పాండే, అలిజే అగ్నిహోత్రి, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, నవ్య నందా, రణ్‌వీర్ సింగ్ వంటి ప్రముఖులు శ్రుతిని యాప్‌లో అనుసరిస్తున్నారు.