ఏడేళ్లు వ‌రండాలో నివ‌శించిన 100కోట్ల క్ల‌బ్ హీరో

ఈరోజు అనూహ్యంగా స్టార్ అయి ఉండొచ్చు.. కానీ ఒక‌ప్పుడు కాదు క‌దా! అత‌డు కూడా అంద‌రిలాగే ఒక సామాన్య బాలుడు. ఆ రోజుల్లో త‌న తండ్రి చెప్పిన మాట బుద్ధిగా విన‌డం త‌ప్ప సొంత నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం లేదు.;

Update: 2025-07-24 04:16 GMT

ఈరోజు అనూహ్యంగా స్టార్ అయి ఉండొచ్చు.. కానీ ఒక‌ప్పుడు కాదు క‌దా! అత‌డు కూడా అంద‌రిలాగే ఒక సామాన్య బాలుడు. ఆ రోజుల్లో త‌న తండ్రి చెప్పిన మాట బుద్ధిగా విన‌డం త‌ప్ప సొంత నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం లేదు. అయితే అప్ప‌ట్లోనే త‌న‌కు15ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు వ‌రండా(కారిడార్)లో ఏడేళ్ల పాటు నివ‌శించాన‌ని చెప్పాడు 'సైయారా' ఫేం అహాన్ పాండే. త‌న తండ్రి గ‌దికి ద‌గ్గ‌ర‌గా ఉండే ఈ వ‌రండా మీదుగా ఇత‌రులు లోనికి వెళ్లేప్పుడు త‌న‌ను ట‌వ‌ల్ చుట్టుకుని ఉండ‌డం చూసేవార‌ట‌. ప్ర‌తిరోజూ ట‌వల్ లో చూసేవార‌ని తెలిపాడు.

త‌న సోద‌రి అల‌నా పాండే యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్బ్యూలో అత‌డు ఈ విష‌యాన్ని చెప్పాడు. నిజానికి అహాన్ పాండే చిన్న వ‌య‌సులో ఉన్న‌ప్పుడు అత‌డి తండ్రి చింకీ పాండే అంత ధ‌నికుడు కాదు. ఇరుకు ఇంట్లో త‌న‌కంటూ ఒక గ‌ది కూడా లేని ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని అత‌డు ఎంతో తెలివిగా చెప్పాడు. ఇక త‌న సోద‌రి అల‌నా పాండే త‌న‌కు సిగ‌రెట్ తాగ‌డం నేర్పింద‌ని కూడా తెలిపాడు. 15 ఏళ్ల వయసులో బాత్రూమ్ లో తన మొదటి సిగరెట్ కాల్చాను అని చెప్పాడు. త‌న‌ను త‌క్కువ గారాబం చేసేవార‌ని కూడా అన్నాడు.

అయితే త‌న సోద‌రుడు అబ‌ద్ధం చెబుతున్నాడ‌ని, ఆశ్చర్యపోయిన అలానా తానకు దీంతో ఏ సంబంధం లేద‌ని క‌వ‌ర్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించింది. అహాన్ సిగ‌రెట్ పిచ్చివాడిని అని చెప్ప‌లేక‌పోతున్నాడు! అని స‌ర‌దాగా న‌వ్వుతూనే సెటైర్ వేసింది. త‌న‌ను ప్ర‌జ‌లు చెడ్డ సోదరి అనుకుంటార‌ని అల‌నా భ‌య‌ప‌డింది. నేను ఏదో క‌నుగొన్నాను వాడిలో అని అలనా అంది. అహాన్ పాండే- అనీత్ ప‌ద్దా జంట‌గా మోహిత్ సూరి తెర‌కెక్కించిన సైయారా ఇటీవ‌లే విడుద‌లైన మొద‌టి ఐదు రోజుల్లో 130 కోట్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌క్సెస్ ని అహాన్ అత‌డి సోద‌రి అల‌నా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Tags:    

Similar News