గెటప్ మార్చిన సైయారా హీరో.. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా?
సైయారా మూవీలో నటించిన అహాన్ పాండే పొడవాటి జుట్టు మరియు ఒత్తయిన గడ్డంతో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. కానీ తాజాగా తన లుక్ మొత్తాన్ని చేంజ్ చేశారు.;
బాలీవుడ్ నటుడు అహన్ పాండే ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించారు. ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈయన సినిమాకి ఎంతమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారో చెప్పనక్కర్లేదు. అలా అహాన్ పాండే ఈ ఏడాది నటించిన సైయారా మూవీ ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ముఖ్యంగా యూత్ ని అట్రాక్ట్ చేయడమే కాకుండా కన్నీళ్లు పెట్టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టి అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే అలాంటి సైయారా మూవీ హీరో అహాన్ పాండే తాజాగా సరికొత్త లుక్ లో దర్శనమిచ్చారు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో అమ్మాయిలు ఈ ఫోటో చూసి ఫిదా అయిపోతున్నారు.
సైయారా మూవీలో నటించిన అహాన్ పాండే పొడవాటి జుట్టు మరియు ఒత్తయిన గడ్డంతో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. కానీ తాజాగా తన లుక్ మొత్తాన్ని చేంజ్ చేశారు. సైయారా మూవీలో లవర్ బాయ్ గా కనిపించిన ఈయన తాజాగా గడ్డం షార్ట్ చేసి, హేర్ కూడా చిన్నగా కట్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అయితే లవర్ బాయ్ కాస్త యాక్షన్ లుక్ లోకి మారడానికి కారణం ఆయన నెక్స్ట్ చేయబోయే ఓ యాక్షన్ మూవీ..
అహాన్ పాండే, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్లో తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నారు. ఈ మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఆ యాక్షన్ మూవీ కోసమే అహాన్ పాండే ఈ విధంగా తన లుక్ ని చేంజ్ చేశారని అర్థమవుతుంది.ఇక అహాన్ పాండే నెక్స్ట్ మూవీ 2026 లో షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఆదిత్య చోప్రా, డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ కాంబోలో మేరే బ్రదర్ కి దుల్హాన్,సుల్తాన్, గుండే, టైగర్ జిందా హై వంటి సినిమాలు వచ్చాయి. అలా వీరి కాంబోలో రాబోతున్న 5వ మూవీలో అహాన్ పాండే నటించబోతున్నారు..
సైయారా మూవీ విషయానికి వస్తే.. మోహిత్ సూరి డైరెక్షన్లో అహాన్ పాండే,అనీత్ పద్దా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ అద్భుతమైన ప్రేమ కథ సినిమాకి ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలా జూలై 18 న విడుదలైన ఈ మూవీ థియేటర్లో 50 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక చిన్న సినిమా 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా చూసి ప్రేక్షకులతో పాటు ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా ప్రశంసించారు. అలా అహాన్ పాండేకి మొదటి సినిమానే బ్లాక్బస్టర్ అవ్వడంతో రెండో సినిమాపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. మరి సైయారాలో లవర్ బాయ్ గా అహాన్ పాండేని ఆదరించిన ప్రేక్షకులు యాక్షన్ హీరోగా యాక్సెప్ట్ చేయగలరా అనేది చూడాలి.