• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  14 ఏళ్ల తర్వాత స్టార్స్...

14 ఏళ్ల తర్వాత స్టార్స్ కలయిక...!

| పాన్ ఇండియా రేంజ్ లో మలయాళ సినిమాలు కుమ్మేస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-04-17 04:24 GMT

ఇతర సినిమా ఇండస్ట్రీలతో పోల్చితే మలయాళ సినిమా ఇండస్ట్రీలో అరుదైన కలయికల్లో సినిమాలు వస్తూ ఉంటాయి, అంతే కాకుండా సున్నితమైన అంశాలతో కథలు రూపొందిస్తూ, విభిన్నమైన కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలను అక్కడి ఫిల్మ్ మేకర్స్ తీసుకు వస్తూ ఉన్నారు.


ఈ మధ్య కాలంలో కమర్షియల్‌ గా కూడా మలయాళ సినిమాలు ఇతర భాషల సినిమాలతో పోటీ పడుతూ వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో మలయాళ సినిమాలు కుమ్మేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో అరుదైన కలయికలో సినిమా రాబోతుంది.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ ఇటీవలే బ్రహ్మయుగం అనే విభిన్నమైన సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకుని, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక గోట్‌ లైఫ్ సినిమాతో పృథ్వీరాజ్ సుకుమారన్‌ పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా జాతీయ స్థాయి అవార్డు దక్కించుకునే విధంగా పృథ్వీరాజ్ నటన ఉందంటూ ప్రశంసలు దక్కాయి.

వీరిద్దరి కాంబోలో ఇప్పుడు ఒక సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 14 ఏళ్ల క్రితం వీరిద్దరూ కలిసి పోకిరి రాజా సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరిని ఒకే స్క్రీన్ పై చూడబోతున్నందుకు మలయాళ ప్రేక్షకులతో పాటు, పాన్ ఇండియా రేంజ్ మలయాళ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆంటో జోసెఫ్‌ నిర్మాణంలో రూపొందబోతున్న ఈ అరుదైన మల్టీ స్టారర్‌ మూవీతో కొత్త దర్శకుడు పరిచయం అవ్వబోతున్నాడు. ఈ సినిమాలో మమ్ముటీ, పృథ్వీరాజ్‌ సుకుమారన్ లు విరోధులుగా కనిపించబోతున్నారట. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • MalayalamFilmIndustry 
  • FilmIndustry 
  • PanIndiaRangeMovies 
  • Mammootty 
  • PritvirajSukumaran 
  • Pokkiriraja 
  • AntoJoseph 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS