సక్సెస్ ఫార్ములాని పట్టేసిన ఆదిత్య హాసన్
ఇక అసలు విషయానికొస్తే టాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ ఏ రేంజ్ సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు.;
ఒక సినిమా రిజల్ట్ ఎఫెక్ట్.. వారు చేసే తర్వాతి ప్రాజెక్టులపై చాలా ఉంటుంది. ఆ రిజల్ట్ హిట్టైనా, ఫ్లాపైనా దాని తాలూకా ఎఫెక్ట్ వారు చేసే నెక్ట్స్ మూవీస్ కు వర్తిస్తుంది. ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ గా వస్తే వారు చేసే నెక్ట్స్ మూవీస్ కు మంచి హైప్, బిజినెస్ దక్కుతుంది. అదే నెగిటివ్ రిజల్ట్ వస్తే ఆ సినిమాకు సరైన బిజినెస్ జరగదు. అందుకే తర్వాతి సినిమాల విషయంలో ఎవరైనా ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు.
నిర్మాతగానూ సక్సెస్ అయిన ఆదిత్య హాసన్
ఇక అసలు విషయానికొస్తే టాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ ఏ రేంజ్ సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పెట్టుబడి- రాబడి యాంగిల్ లో చూస్తే టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యూట్యూబర్ మౌళి హీరోగా నటించగా, 90స్ వెబ్‌సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమాను నిర్మించారు.
ఆనంద్ దేవరకొండతో సితార బ్యానర్లో సినిమా
90స్ వెబ్‌సిరీస్ తో ఆదిత్య హాసన్ డైరెక్టర్ గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. ఆ సినిమా సక్సెస్ తో ఏకంగా తన సినిమాను సితార బ్యానర్ లో కన్ఫర్మ్ చేసుకున్నారు ఆదిత్య హాసన్. ఆనంద్ దేవరకొండ హీరోగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు డైరెక్టర్ గా సినిమా చేస్తూనే మరోవైపు లిటిల్ హార్ట్స్ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు ఆదిత్య హాసన్.
లిటిల్ హార్ట్స్ బజ్ కు కారణం 90స్ కాంబినేషనే
లిటిల్ హార్ట్స్ సినిమాకు ఆ రేంజ్ బజ్ రావడానికి కారణం అందులో నటించిన 90స్ ఫేమ్ మౌళి మరియు చిత్ర నిర్మాత ఆదిత్య హాసనే. వారిద్దరూ గతంలో చేసిన 90స్ సిరీస్ మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని ఆదిత్య హాసన్ పై ఉన్న నమ్మకమే లిటిల్ హార్ట్స్ కు హైప్ ను పెంచింది. మొత్తానికి అందరి నమ్మకాన్ని నిజం చేస్తూ ఆదిత్య హాసన్ నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్నారు.
ఎలాగైతే 90స్ సక్సెస్ లిటిల్ హార్ట్స్ కు ఉపయోగపడిందో, ఇప్పుడలానే లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెక్ట్స్ మూవీకి ఉపయోగపడింది. ఆనంద్ దేవరకొండతో ఆదిత్య చేస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగానే అప్పుడే ఓటీటీ డీల్ పూర్తైనట్టు తెలుస్తోంది. రూ.11 కోట్ల భారీ ధరకు ఆనంద్- ఆదిత్య కలయికలో వస్తోన్న మూవీ ఓటీటీ రైట్స్ ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందని టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్త వినిపిస్తోంది.