బాలయ్య కల నిజం చేసే దర్శకుడు ఎవరు..?
పాతికేళ్ల క్రితం వచ్చిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ చేయాలని బాలకృష్ణ చాలా ఆసక్తిగా ఉన్నారు.;
పాతికేళ్ల క్రితం వచ్చిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ చేయాలని బాలకృష్ణ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆదిత్య 369 సీక్వెల్ కి ఆదిత్య 999 అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా కథ దాదాపు పూర్తి కాగా డైరెక్షన్ కూడా బాలయ్య చేయాలని ముందు అనుకున్నా యాక్టింగ్, డైరెక్షన్ అంటే సినిమా అవుట్ పుట్ మీద ఎఫెక్ట్ పడుతుందని బాలకృష్ణ ఆ బాధ్యతను మరొకరి మీద పెట్టాలని అనుకున్నాడు. ముందు ఎవరిపేర్లనో అనుకున్న ఈ సినిమాకు ఫైనల్ గా క్రిష్ ని డైరెక్ట్ గా ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి.
ఘాటితో క్రిష్ డిజప్పాయింట్..
ఐతే అనౌన్స్ చేయడమే తరువాయి ఇక సినిమా మొదలు పెట్టడమే అనుకోగా మళ్లీ క్రిష్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని టాక్. క్రిష్ ఈ ప్రాజెక్ట్ మీద రెండేళ్ల పైగా వర్క్ చేయాలని ఆలోచించి ఘాటితో డిజప్పాయింట్ చేసిన తను వెంటనే మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అందుకే బాలయ్య ఆదిత్య 999 సినిమా చేయడం కుదరదని చెప్పేశాడట.
సో మళ్లీ ఎప్పటిలానే ఆదిత్య 999 సినిమాకు డైరెక్టర్ వాంటింగ్ ఉంది. ఆదిత్య 999 సినిమాకు స్టోరీ అంతా సిద్ధమైనా ఆ సినిమా కోసం సెట్ ప్రాపర్టీస్, ఇంకా షూటింగ్ కూడా ఎక్కువ టైం పట్టేలా ఉందని తెలుస్తుంది. అందుకే అప్పటివరకు వేరే సినిమా చేసే అవకాశం లేకపోవడం వల్ల క్రిష్ లాంటి డైరెక్టర్స్ ఈ మూవీని వదులుకుంటున్నారట.
ఆదిత్య 999 తీసే డైరెక్టర్..
ఆల్రెడీ హరి హర వీరమల్లు కోసమే నాలుగేళ్లు టైం వేస్ట్ చేసి ఫైనల్ గా అతను బయటకు వచ్చాక మరో దర్శకుడు ఆ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశాడు. మళ్లీ ఆ ఛాన్స్ మరో సినిమాకు ఇవ్వడం ఎందుకనే ఆలోచనతో క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. క్రిష్ కాదన్నాడు సరే ఆదిత్య 999 సినిమా తీసే డైరెక్టర్ ఎవరు అన్నది ప్రస్తుతానికి ఆన్సర్ దొరకట్లేదు. క్రిష్ కాకుండా ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది గెస్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరి బాలయ్య ఈ ఛాన్స్ ఎవరికి ఇస్తారన్నది చూడాలి. మరోపక్క ఆదిత్య 999 సినిమాలో నందమూరి వారసుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడన్న న్యూస్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా కాబట్టి సినిమా విషయంలో బాలకృష్ణ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఐతే త్వరలోనే డైరెక్టర్ ని ఫైనల్ చేసి ఆదిత్య 999 మొదలు పెడతారని తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా లైన్ లో పెట్టాడు. ఆ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది.