400 ఏళ్ల నాటి ఆల‌యంలో నిశ్చితార్థంపై అదితీరావ్

ర‌హ‌స్యంగా నిశ్చితార్థం పూర్త‌యింద‌ని కూడా నెటిజ‌నులు చ‌ర్చించుకున్నారు.

Update: 2024-05-02 15:48 GMT

అదితి రావ్ హైదరీ - సిద్ధార్థ్ జంట ప్రేమాయ‌ణం కొన్నేళ్లుగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. మార్చిలో ఈ జోడీ తమ నిశ్చితార్థాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించడం మీడియాతో పాటు ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించింది. చాలా కాలంగా ఈ జంట అనుబంధంపై ప్ర‌చారం ఉంది. నేడో రేపో పెళ్లిబంధంతో ఒక‌టి కానున్నార‌ని కూడా పుకార్లు షికార్ చేసాయి. ర‌హ‌స్యంగా నిశ్చితార్థం పూర్త‌యింద‌ని కూడా నెటిజ‌నులు చ‌ర్చించుకున్నారు.

ఇలాంటి అన్ని పుకార్ల‌కు అధికారికంగా ముగింపు పలికేందుకు సిధ్ - అదితీ రావ్ జంట త‌మ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అదితి రావ్ హైద‌రీ ఇటీవల తన కుటుంబానికి చెందిన 400 ఏళ్ల పురాతన ఆలయంలో జరిగిన త‌మ నిశ్చితార్థ వేడుక గురించి ఓపెన‌య్యారు. బాలీవుడ్ బబుల్‌తో అదితిరావ్ మాట్లాడుతూ ''నేను 400 సంవత్సరాల పురాతనమైన మా కుటుంబానికి చెందిన ఆలయంలో మా ప్రారంభాన్ని గుర్తించాల‌నుకున్నాం. నేను అక్కడికి వెళ్లి పూజలు చేయాలనుకున్నాను.. ఒక చిన్న వేడుక‌గా నిశ్చితార్థం జరిగింది'' అని క్లారిటీనిచ్చారు.

Read more!

అదితి రావ్ మాట్లాడుతూ.. ''మాపై చాలా పుకార్లు ఉన్నాయి.. వాటన్నిటినీ క్లియ‌ర్ చేయడానికి మేము నిశ్చితార్థానికి సంబంధించిన‌ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేయాల‌ని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మా అమ్మ నాతో చెప్పారు. దయచేసి ప్రజలకు చెప్పండి.. నాకు నాన్‌స్టాప్ కాల్స్ వస్తున్నాయిని అన్నారు. ఆ త‌ర్వాత మేం వెంట‌నే ఓకే చెప్పాం'' అని అన్నారు. ఇంత‌కుముందు నిశ్చితార్థ ప్రకటనలో జంట తమ నిశ్చితార్థపు ఉంగరాలను ప్రదర్శిస్తున్న‌ స్నాప్‌షాట్‌ను షేర్ చేసారు. ఈ పోస్ట్‌కి అదితి క్యాప్షన్‌గా ''అతడు (సిధ్) అవును అని చెప్పాడు! E. N. G. A. G. E. D'' అని రాయ‌గా... సిద్ధార్థ్ మరోవైపు త‌న సోష‌ల్ మీడియాలో ''ఆమె (అదితీ) అవును అని చెప్పింది! E. N. G. A. G. E. D'' అని రాశాడు.

ఇంత‌కుముందు గలాట్టా గోల్డెన్ స్టార్స్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ త‌మ‌ నిశ్చితార్థ వేడుక గురించి మాట్లాడారు. తమ పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ గురించి కూడా ఓపెన్ గా చెప్పాడు. ర‌హ‌స్య నిశ్చితార్థం అని జ‌నం అనుకున్నారు. కానీ కుటుంబ స‌మ‌క్షంలో జ‌రిగిన నిశ్చితార్థం. రెండిటికీ చాలా తేడా ఉంది. మేము ఆహ్వానించని వారు దానిని రహస్యంగా భావిస్తారు.. కాని వారికి అది ప్రైవేట్ వ్య‌వ‌హారం అని తెలుసు! అంటూ సెటైరికల్ గా స్పందించాడు. అదితీ రావు 'అవును' అని చెప్ప‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింద‌ని, తాను ఉత్తీర్ణ‌త చెంద‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంద‌ని కూడా సిద్ధార్థ్ అన్నాడు. తుది ఫలితం తప్పనిసరిగా అవును లేదా కాదు.. పాస్ లేదా ఫెయిల్ అయి ఉండాలి. అదృష్టవశాత్తూ నేను ఉత్తీర్ణత సాధించానో లేదోనని ఆందోళన చెందాను. పెళ్లి తేదీ పెద్దల (కుటుంబం) నిర్ణ‌యంపై ఆధారపడి ఉంటుంది. పెద్ద‌లు నిర్ణయించిన తర్వాత సరైన సమయంలో పెళ్లి జరుగుతుందని తెలిపాడు.

అదితి - సిద్ధార్థ్ జంట‌ 2021లో 'మహా సముద్రం' చిత్రీకరణ సమయంలో డేటింగ్ ప్రారంభించారు. ప్రేమ విక‌సించి ఇప్పుడు పెళ్లితో ఒక‌టి కానున్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే అదితీరావ్ హైద‌రీ న‌టించిన హీరామండి ఇటీవ‌ల నెట్ ఫ్లిక్స్ లో ప్ర‌సారం అయింది. విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను పొందింది.

Tags:    

Similar News