• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డైరెక్ట‌ర్ శంక‌ర్...

డైరెక్ట‌ర్ శంక‌ర్ కూతురిని 'మీమ్స్‌'తో ఆడుకున్నారు!

| రెండవ భాగంలో కమల్ హాసన్ సేనాధిపతిగా తన పాత్రను రిపీట్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-06-07 08:43 GMT

విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ న‌టించిన భార‌తీయుడు 2 (ఇండియన్ 2) ఎట్టకేలకు పెద్ద తెరపైకి వస్తోంది. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ఆడియో ఆవిష్కరణ జూన్ 1న చెన్నైలో జరిగింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1996 కల్ట్ క్లాసిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ కి సీక్వెల్. రెండవ భాగంలో కమల్ హాసన్ సేనాధిపతిగా తన పాత్రను రిపీట్ చేస్తున్నారు.

ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన‌ ఆడియో లాంచ్‌లో ప‌లువురు అతిథులు పాల్గొన్నారు. మౌని రాయ్, ఊర్వశి రౌతేలా ఈ లాంచింగ్ కార్య‌క్ర‌మంలో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. ఈ చిత్రం నుండి పాటలకు శృతి హాసన్, అదితి శంకర్, అర్జిత్ శంకర్ వంటి వారు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. అయితే శంక‌ర్ కుమార్తె న‌టి అదితి శంకర్ ఆడియో లాంచ్‌లో డ్యాన్స్ చేస్తూ పాడుతూ తన బిట్‌ను ప్రదర్శించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది. కానీ దీనిని చాలామంది ట్రోల్ చేసారు. అతిథీ తన తండ్రి శంకర్‌కి అత‌డు తెర‌కెక్కించిన‌ చిత్రాలలోని పాటలకు డ్యాన్సులు చేయ‌డం ద్వారా నివాళులర్పించింది. కానీ అతిథి డ్యాన్సుల‌పై సెటైర్లు వేసారు. చాలా మంది సోషల్ మీడియాలో మీమ్స్ షేర్ చేసారు.

ఇండియన్ 2లో కమల్ హాసన్, సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, జగన్, రిషి, నేదురుమూడి వేణు, వివేక్ , గురు సోమసుందరం తదితరులు న‌టించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. భార‌తీయుడు 2 పార్ట్ 2, 3ల‌ను క‌లిపి శంక‌ర్ ఒకేసారి తెర‌కెక్కించారు. రెండవ భాగం తరువాత మూడవ భాగం 6 నెలల్లో విడుదల కానుంది. భార‌తీయుడు 2లో కాజల్ అగర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్ని పోషించారు.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • FilmIndustry 
  • Indian2 
  • KamalHaasan 
  • Shankar 
  • MouniRoy 
  • UrvashiRautela 
  • ShrutiHaasan 
  • AditiShankar 
  • Memes 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS