మాస్ రాజాకి జోడీగా శంకర్ కుమార్తె!
మాస్ రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ 'మాస్ జాతర'లో నటిస్తున్నాడు.;
మాస్ రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ 'మాస్ జాతర'లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే పట్టాలెక్కే ప్రాజెక్ట్ కిషోర్ దే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా రవితేజకు జోడీగా కొంత మంది పేర్లు కూడా తెర పైకి వచ్చాయి. కేతికశర్మ, మమితా బైజు, కయాదులో లోహర్ పేర్లు వినిపించాయి.
తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ పేరు తెరపైకి వచ్చింది. రావడమే కాదు మిగతా ముగ్గురు కంటే అదితి శంకర్ ఈ పాత్రకు పర్పెక్ట్ గా సూటువుతుంది. అదితిపై టెస్ట్ షూట్ చేయగా రవితేజ సరసన అన్ని రకాలుగా సెట్ అవుతుందట. దీంతో అదితి ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మమితా బైజు, కేతిక శర్మ, కయాదులపై ఇంకా లుక్ టెస్ట్ నిర్వహించలేదు.
మరి అదితి నుంచి పాజిటివ్ ఇంప్రెసన్ వచ్చిన నేపథ్యంలో ఈ ముగ్గురిని కూడా లుక్ టెస్ట్ కి పిలుస్తారా? అదితి శంకర్ నే ఫైనల్ చేస్తారా? అన్నది చూడాలి. అవకాశం వస్తే అదితి శంకర్ కి మాత్రం గొప్ప ఛాన్స్ అవుతుంది. రీసెట్ గా 'భైరవం'సినిమాతో అదితి శంకర్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. 'భైరవం'లో అదితి స్క్రీన్ ప్రజెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.
ఇప్పటికే తమిళ్ లో బాగానే అవకాశాలు అందుకుంటుంది. యంగ్ హీరోలకు పర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుంది. సీనియర్ హీరోలకు ప్రమోట్ అవుతుంది. ఈ నేపథ్యంలో రవితేజ ఆఫర్ నిజమైతే? అదితి శంకర్ టాలీవుడ్ కెరీర్ లో మరో కొత్త అడుగు ముందుకు పడినట్లే. అవకాశాల పరంగా అదితి తండ్రి ఇమేజ్ తో సంబంధం లేకుండా అందుకుంటుంది.