• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అదుర్స్-2 అసలు జరగని...

అదుర్స్-2 అసలు జరగని పని.. ఎందుకంటే

| టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. అదుర్స్ సినిమా అప్పట్లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-04-04 01:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. అదుర్స్ సినిమా అప్పట్లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దాదాపు 14 ఏళ్ల క్రితం రిలీజైన ఈ మూవీలో తారక్ డ్యూయల్ రోల్ పోషించారు. ఎన్టీఆర్ చేసిన చారి రోల్ అయితే ఐకానిక్‍ గా నిలిచిపోయింది. చారి పాత్రలో తారక్ పండించిన కామెడీ, మేనరిజమ్స్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటాయి. ఎన్టీఆర్- బ్రహ్మానందం కామెడీ ఆ సినిమాకు హైలైట్‍ గా నిలిచింది.

వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఆ మూవీ రచయిత కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలే. ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన ఈ మూవీ సీక్వెల్ కోసం ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానని తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు అదుర్స్-2 టాపిక్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇక అదుర్స్-2 విషయంలో కోన వెంకట్ చేసిన కామెంట్స్ పై డైరెక్టర్ వినాయక్ స్పందిస్తారేమోనని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే వినాయక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో అదుర్స్ సీక్వెల్ పై స్పష్టతనిచ్చారు. అదుర్స్-2 ఎప్పుడు చేస్తారు, పాజిబుల్ అవుతుందా అవ్వదా అని యాంకర్ అడగ్గా.. పాజిబుల్ అవ్వదని క్లారిటీ ఇచ్చారు. ఒకట్రెండు ఐడియాస్ అనుకున్నాం గానీ, అవి అక్కడితో ఆగిపోతున్నాయని తెలిపారు. తనకే నచ్చడం లేదని వెల్లడించారు.

"అదుర్స్ అనేది నా కెరీర్ లో ఓ బెస్ట్ మూవీ. తారక్ కెరీర్ లో కూడా మంచి సినిమా. దాన్ని అలానే ఉంచితేనే బెటర్. ఇప్పటికీ టీవీ, ఫోన్స్ లో ఆ సినిమాను చూస్తూనే ఉంటారు. దాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. సినిమా విషయంలో ఎవరూ బాధపడకూడదని అప్పుడు కొన్ని చర్యలు తీసుకున్నాను. అభ్యంతరం తెలిపిన వాళ్లకు క్లారిటీ ఇచ్చి మరీ సినిమా రిలీజ్ చేశాను. ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ ఎప్పుడైనా చేయగలరు" అని వినాయక్ తెలిపారు.

మంచి స్క్రిప్ట్ దొరికితే ఎన్టీఆర్ తో మళ్లీ ఇంకో సినిమా చేస్తానని చెప్పారు. ఇప్పుడు నెట్టింట.. ఓ వైపు కోన వెంకట్ మాట్లాడిన వీడియో, మరోవైపు వినాయక్ మాట్లాడిన ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అదుర్స్ -2 విషయంపై వినాయక్ గానీ, ఎన్టీఆర్ గానీ స్పందిస్తారేమో చూడాలి.

ఇంతకీ వెంకట్ ఏమన్నారంటే?

కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి-2 ట్రైలర్ ఈవెంట్ లో వెంకీకి సీక్వెల్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. "వెంకీ 2 సంగతి నాకు తెలియదు కానీ.. అదుర్స్ 2 చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. అవసరమైతే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి.. నిరాహార దీక్ష చేసైనా సరే ఆయనతో అదుర్స్ 2 చేయిస్తా. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరు కూడా చేయలేరు. అదుర్స్ 2 చిత్రాన్ని దర్శకుడు వినాయక్‍ తోనే ప్లాన్ చేస్తాం" అని తెలిపారు. ఇక వినాయక్ ఇప్పటికే కుదరదని చెప్పేశారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • Adhurs2 
  • Konavenkat 
  • NTR 
  • Tollywood 
  • Adhurssequel 
  • Vinayak 
  • Venky2 
  • Brahmanandam 

Similar News

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

Copyright @2026

Powered by Blink CMS