ఎన్టీఆర్ ఓకే అన్నా.. ‘అదుర్స్ 2’కి ఇంకో గ్రీన్ సిగ్నల్ కావాలి!

'అదుర్స్ 2'.. నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్. లేటెస్ట్ గా 'కామ్రేడ్ కళ్యాణ్' ప్రెస్ మీట్ లో కోన వెంకట్ చేసిన కామెంట్స్ తో ఈ సీక్వెల్ పేరు మళ్లీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2026-10-08 08:01 GMT

'అదుర్స్ 2'.. నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్. లేటెస్ట్ గా 'కామ్రేడ్ కళ్యాణ్' ప్రెస్ మీట్ లో కోన వెంకట్ చేసిన కామెంట్స్ తో ఈ సీక్వెల్ పేరు మళ్లీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల క్రితం తారక్ తనకు ప్రాంక్ కాల్ చేశాడని, ఈ వీకెండ్ కలుద్దామని చెప్పాడని కోన రివీల్ చేశారు. ఆ మీటింగ్ లో 'అదుర్స్ 2' గురించే తాను అడగబోతున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఎన్టీఆర్ ఓకే చెప్పినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అంత ఈజీ కాదు. ఈ సీక్వెల్ విషయంలో డైరెక్టర్ వి.వి. వినాయక్ డెసిషన్ చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే ఇదే ఏడాది మార్చిలో 'అదుర్స్ 2' పై ఆయన చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొదటి సినిమా కథ అక్కడితోనే ఎండ్ అయిపోయిందని, ఇప్పుడు సీక్వెల్ కోసం బలవంతంగా కథను సాగదీస్తే పాత మ్యాజిక్ కచ్చితంగా దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతటి క్లాసిక్ ఎంటర్టైనర్ ను అలాగే వదిలేయడమే మంచిదనే కోణంలో వినాయక్ తన మనసులోని మాట బయటపెట్టారు. కానీ రచయిత కోన వెంకట్ మాత్రం ఎప్పటినుంచో ఈ సీక్వెల్ థాట్ ను వదలడం లేదు. ఫిబ్రవరిలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మొదటి ముప్పై నిమిషాల స్క్రిప్ట్ పక్కాగా రెడీ అయిందని, తారక్ కమిట్మెంట్స్ పూర్తవ్వగానే వినిపిస్తానని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు. అంటే రైటర్ దగ్గర కథ మీద గట్టి నమ్మకం ఉంది. కానీ దర్శకుడి దగ్గర మాత్రం ఆ ఇంట్రెస్ట్ కనిపించడం లేదు.

ఒకే సినిమా సీక్వెల్ పై ఈ ఇద్దరి మధ్య వేర్వేరు అభిప్రాయాలు ఉండటమే ఇక్కడ అసలు పాయింట్. ఇక హీరో ఎన్టీఆర్ విషయానికి వస్తే.. గతంలో ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ పై కొంత వెనకడుగు వేశారు. 2025లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో కామెడీ చేయడం చాలా కష్టమని, మళ్లీ ఆ చారి క్యారెక్టర్ లో అప్పటి టైమింగ్ వస్తుందో రాదో అనే భయం తనకు ఉందని చెప్పారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. అంతకుముందు ఒకానొక దశలో 'అదుర్స్ 2' చేద్దామని వినాయక్ ను పదే పదే అడిగింది ఎన్టీఆరే కావడం విశేషం.

దీంతో 'అదుర్స్ 2' ప్రయాణం అంతా ఒక సినిమా స్టోరీలా మారిపోయింది. మొదట ఎన్టీఆర్ చేయాలని ఉత్సాహం చూపించారు, ఆ తర్వాత ఆయనకే డౌట్ వచ్చింది. మరోవైపు కోన వెంకట్ కథను సిద్ధం చేస్తే, అసలు సీక్వెల్ అవసరం లేదని వినాయక్ తేల్చేశారు. ఇలాంటి కన్ఫ్యూజన్ మధ్య ఇప్పుడు తారక్, కోన వెంకట్ ల మీటింగ్ జరగబోతుండటం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ మీటింగ్ లో ఒకవేళ ఎన్టీఆర్ పాజిటివ్ గా రెస్పాండ్ అయినా సరే.. ఆ తర్వాత ప్రశ్న మళ్లీ వినాయక్ దగ్గరకే వెళ్తుంది. మరి వినాయక్ మనసు మార్చుకుని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తారా, లేక కథను మరో దర్శకుడి చేతిలో పెడతారా అన్నది అప్పుడే తేలుతుంది. చారి, భట్టు కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ తో 'అదుర్స్ 2' అని పేరు చెబితే చాలు క్షణాల్లో ట్రెండ్ అవుతుంది. కానీ ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ కావాలంటే ఈ ముగ్గురి గ్రీన్ సిగ్నల్ పడాల్సిందే.



Tags:    

Similar News