బ్యాండ్ మేళం తర్వాత.. కోనకు ఈ కాన్ఫిడెన్స్ ఎందుకు!

రైటర్‌గా కోన వెంకట్ ట్రాక్ రికార్డ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రెడీ, దూకుడు, అదుర్స్ నుంచి మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ ఎన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి.

Update: 2026-10-08 08:19 GMT

రైటర్‌గా కోన వెంకట్ ట్రాక్ రికార్డ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రెడీ, దూకుడు, అదుర్స్ నుంచి మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ ఎన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి. కానీ నిర్మాతగా, ప్రెజెంటర్‌గా మారిన తర్వాత ఆయనకు ఆశించిన స్థాయిలో హిట్లు పడటం లేదు. వరుస పరాజయాలు ఎదురవుతున్నా.. లేటెస్ట్ గా 'కామ్రేడ్ కళ్యాణ్' ప్రెస్ మీట్ లో ఆయన చూపించిన కాన్ఫిడెన్స్ హైలెట్ అయ్యింది.

ఈ ఏడాదే కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై 'బ్యాండ్ మేళం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న 'కోర్ట్' మూవీ హిట్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల్లాను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. కాంబినేషన్ క్రేజ్‌తో ప్రీ రిలీజ్ బజ్ అయితే వచ్చింది కానీ, థియేటర్లలో మాత్రం ఆ బొమ్మ నిలబడలేకపోయింది. కథ, నేరేషన్ విషయంలో వచ్చిన విమర్శలతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

దానికంటే ముందు వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ప్రాజెక్ట్ పై కూడా కోన వెంకట్ చాలా ఆశలే పెట్టుకున్నారు. సూపర్ హిట్ అయిన గీతాంజలి సీక్వెల్ కావడంతో కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ నిర్మాణంలోనూ భాగస్వామి అయ్యారు. కానీ ఈ హర్రర్ కామెడీకి కూడా మిక్స్‌డ్ టాక్ రావడంతో నిరాశే ఎదురైంది. ఇలా ఆయన బ్యానర్ నుంచి వచ్చిన రెండు థియేట్రికల్ అటెంప్ట్స్ కూడా ఆయన బ్రాండ్‌కు తగ్గ రిజల్ట్ ఇవ్వలేకపోయాయి.

ఇలాంటి టైమ్‌లో 'కామ్రేడ్ కళ్యాణ్' ప్రెస్ మీట్‌లో కోన వెంకట్ స్పీచ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పోటీగా రావాల్సిన 'ఆదర్శ కుటుంబం' పోస్ట్‌పోన్ అయినందుకే ఇంత జోష్‌లో ఉన్నారా అని అడిగితే.. “నేను అంత శాడిస్ట్‌ను కాదు” అని కౌంటర్ వేశారు. నిన్ననే ఫస్ట్ కాపీ చూశామని, అప్పుడే తమ ఫ్యూచర్ ఏంటో తెలిసిపోయిందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అంతేకాదు, ఏకంగా ఈ సినిమాకు 3 నుంచి 3.5 రేటింగ్స్ రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.

ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాతే కోన ఈ స్థాయిలో ఓపెన్‌గా రేటింగ్స్ గురించి మాట్లాడటం హైలెట్ అవుతోంది. ఆయన ధీమా చూస్తుంటే ఈ సినిమా మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నారని అర్థమవుతోంది. పైగా హీరో శ్రీవిష్ణు స్క్రిప్ట్ సెలెక్షన్ మీద ఆడియన్స్ లో ఎప్పుడూ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. దీనికి తోడు రొటీన్ గా కాకుండా, కామెడీకి రొమాన్స్‌తో పాటు పీరియడ్ బ్యాక్‌డ్రాప్ ను కూడా జోడించడం ఈ ప్రాజెక్ట్ మీద మరింత ఆసక్తిని పెంచుతోంది.

జానకిరామ్ మారెళ్ల డైరెక్షన్ లో మహిమా నంబియార్ హీరోయిన్ గా నటించిన కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్ 9న థియేటర్లలోకి రాబోతోంది. షైన్ టామ్ చాకో, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక మరి బ్యాండ్ మేళం తర్వాత కోన వెంకట్ పెట్టుకున్న ఈ కాన్ఫిడెన్స్ బాక్సాఫీస్ దగ్గర ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News