చరణ్ నెక్స్ట్.. టార్గెట్ ఫిక్స్ అయినట్లేనా..
అంటే ఈ దసరాకు చరణ్- సుకుమార్ సినిమా అఫీషియల్ గా మొదలయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా అంటే.. రంగస్థలం మూవీకి మించిన అంచనాలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఆ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సినిమా ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పటిలోగా పూర్తి చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంలో కూడా సుకుమార్ క్లియర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
పెద్ది తర్వాత చరణ్ చేస్తున్న ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. అయితే రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే భారీ హైప్ ఉంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన లాంచింగ్ పై ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దసరా సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 మధ్యలో సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అంటే ఈ దసరాకు చరణ్- సుకుమార్ సినిమా అఫీషియల్ గా మొదలయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. లాంచింగ్ తర్వాత కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని సుకుమార్ భావిస్తున్నారట. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించి.. నాన్ స్టాప్ గా షూటింగ్ కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు ఏడాదిలో సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.
ఇక డిసెంబర్ లో షూటింగ్ మొదలై ఏడాదిలోపే సినిమా పూర్తయితే.. 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. అందులో కూడా 2028 సంక్రాంతి లేదా సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అంటే సినిమా లాంచింగ్ నుంచి రిలీజ్ వరకు ముందుగానే ఓ టైమ్ లైన్ పెట్టుకుని టీమ్ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఆ ప్రాజెక్టుపై అంచనాలు పెరగడానికి మరో రీజన్ సుకుమార్ గత సినిమాలే. పుష్ప ఫ్రాంచైజీతో పాన్ ఇండియా రేంజ్ లో తన మార్క్ చూపించిన ఆయన.. ఇప్పుడు చరణ్ మూవీని ఎలాంటి స్టోరీతో రూపొందిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రంగస్థలంలో చరణ్ ను పూర్తిగా కొత్త యాంగిల్ లో చూపించిన సుకుమార్.. ఈసారి కూడా అలాంటి కొత్త ట్రీట్మెంట్ తో వస్తారా అనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ గతంలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. చరణ్, సుకుమార్ కలిసి కనిపించడంతో పాటు రెండు గుర్రాలు ఉన్న ఆ పోస్టర్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సినిమా స్టోరీపై అప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడున్న ఇన్ఫో ప్రకారం చూస్తే.. దసరాకు లాంచింగ్, డిసెంబర్ లో షూటింగ్ స్టార్టింగ్, ఏడాదిలోపు షూటింగ్ కంప్లీట్.. ఆ తర్వాత 2028లో రిలీజ్. అదే నిజమైతే చరణ్- సుకుమార్ సినిమా రిలీజ్ టార్గెట్ దాదాపు ఫిక్స్ అయినట్టే. మరి అందులో నిజమెంతో వేచి చూడాలి