రాజమౌళి ఒక సీన్ ను అంత పర్ఫెక్ట్ గా ఎలా తీస్తాడు? ఆయన సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది...

రాజమౌళి అంటే ఒక బ్రాండ్. మొదటి సినిమా నుంచి తన కష్టాన్ని నమ్ముకొని రికార్డులను తిరగరాస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు.

Update: 2026-10-08 03:51 GMT

రాజమౌళి అంటే ఒక బ్రాండ్. మొదటి సినిమా నుంచి తన కష్టాన్ని నమ్ముకొని రికార్డులను తిరగరాస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. తన సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. అనవసరమైన సీన్స్ కనిపించవు. రాజమౌళి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంత పర్ఫెక్ట్ గా ఆయన ఒక సన్నివేశాన్ని ఎలా డిజైన్ చేస్తాడు? తన సక్సెస్ ల వెనుక దాగివున్న సీక్రెట్ ఏంటి?

వర్క్ షాప్స్ & హ్యాండీ క్యామ్స్ తో షూట్.

ఒక సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు ఆయన ఒకటికి పది సార్లు దానికి రిహార్సల్స్ చేసుకుంటాడు. ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక తన డైరెక్షన్ టీమ్ ను పెట్టుకొని వర్క్ షాప్ కండక్ట్ చేస్తూ హ్యాండిక్యామ్ కెమెరాతో షూట్ చేస్తాడు. దీనివల్ల ఆ సన్నివేశంలో ఎలాంటి కెమెరా యాంగిల్స్ వాడాలి, ఆర్టిస్టులు ఎక్కడ నిలబడాలనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఇలా చేయడం వల్ల సెట్ కి వెళ్ళాక ఎలాంటి గందరగోళం ఉండదు. ఆర్టిస్టులు సెట్ లోకి అడుగుపెట్టగానే రాజమౌళి తనే స్వయంగా ఆ సీన్స్ లో నటించి చూపిస్తాడు. ఇలా ప్రతి సన్నివేశం తెరకెక్కించడానికి ముందు ఒకటి రెండు సార్లు రిహార్సల్స్ చేసి చూసుకోవడం మంచి పద్ధతి.

ఎమోషనల్ హై ఇవ్వడం.

అలాగే సినిమాలో వచ్చే కోర్ ఎమోషన్ సీన్స్ ఎలా ఎలివేట్ చేయాలి. దాని తర్వాత వచ్చే ఎలివేషనల్ సీన్స్ ను ఎలా ప్రజెంట్ చేయాలి అనేది రాజమౌళికి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు. తన మూవీస్ లో ఎమోషనల్ సన్నివేశాలతో హై ఫీల్ ఇస్తాడు. రాజమౌళి హార్డ్ వర్క్ ను మాత్రమే నమ్ముకున్నాడు. అందుకే ఆయన 24 గంటలు సినిమా గురించే ఆలోచిస్తాడు తప్ప అతనికి వేరే వ్యాపకం లేదు. ఈరోజు పాన్ ఇండియా ప్రేక్షకులు రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అంటే సినిమా ఇండస్ట్రీ మీద రాజమౌళి తన రాజ ముద్రను ఎంత బలంగా వేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమా పోస్టర్ మీద రాజమౌళి పేరు కనిపించిందంటే చాలు ప్రేక్షకుడు ధైర్యంగా వెళ్లి సినిమా చూడచ్చనే ఒక నమ్మకాన్ని సంపాదించుకున్నాడు.

ప్రేక్షకుడి కండ్లల్లో ఆనందం.

మొదటి రోజు తన సినిమాని చూసే ప్రేక్షకుడి కండ్లల్లో ఆనందాన్ని చూడాలని వాళ్ళు పొందే అనుభూతి చాలా ఫ్రెష్ గా ఉండాలని, క్వాలిటీ సినిమాను అందించడానికి తను ఎక్కువగా కష్టపడతాడు.సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ప్రేక్షకుడి హృదయంలో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా సినిమాను తీయడం మరొక ఎత్తు. రాజమౌళి నుంచి వచ్చిన సినిమా 100% ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయాలి. అందులో ఏ ఒక్క సన్నివేశానికి ప్రేక్షకుడు డిసప్పాయింట్ అయినా రాజమౌళి కి నచ్చదు. పర్ఫెక్షన్ కోసం ప్రతి సన్నివేశాన్ని చెక్కుతుంటాడు. అందుకే అతన్ని 'జక్కన్న' అంటారు. తన మైండ్ లో ఉన్న విజువల్ కి దృశ్యరూపం ఇవ్వడానికి రాజమౌళి అనుక్షణం మదనపడుతూనే ఉంటాడు.

Tags:    

Similar News