వెంకటేష్ స్టార్ హీరో అవ్వడం వెనక వాళ్ల పాత్ర ఉందా?

వెంకటేష్ ను చూసిన చాలా మంది సన్నగా ఉన్నాడు. యాక్టింగ్ లో పరిపక్వత లేదు. స్టార్ హీరోల మధ్య జరిగే పోటీలో ఈ కుర్రాడు రాణించడం కష్టమే అన్నారు.

Update: 2026-10-08 03:49 GMT

సినిమా ఇండస్ట్రీ లో వారసత్వం మొదటి మూవీ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతోంది. ఆ తర్వాత సొంత టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తేనే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుంది. లేకపోతే ఫేడ్ ఔట్ అయిపోవాల్సిందే. డాక్టర్ డి రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ కెరియర్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. తండ్రి ప్రొడ్యూసర్ అవ్వడంతో హీరోగా ఎంట్రీ సులభమైంది. కానీ అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. తండ్రి ప్రొడ్యూసర్ అయితే కొడుకుకి యాక్టింగ్ రాకపోయినా హీరో అవ్వచ్చనే విమర్శలను ఎదుర్కొన్నాడు.

విమర్శ నుంచి విక్టరీ వరకు

వెంకటేష్ ను చూసిన చాలా మంది సన్నగా ఉన్నాడు. యాక్టింగ్ లో పరిపక్వత లేదు. స్టార్ హీరోల మధ్య జరిగే పోటీలో ఈ కుర్రాడు రాణించడం కష్టమే అన్నారు. వెంకటేష్ ఆ విమర్శలను మనసులో పెట్టుకొని ఒక్కో మూవీతో సమాధానం చెబుతూ తన నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ టాప్ హీరోగా ఎదిగాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నలుగురు అగ్ర హీరోల్లో తను కూడా ఒక్కరిగా మారాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి సక్సెస్ ఓవర్ నైట్ లో రాలేదు. తను ఎలాంటి సినిమాలు చేయాలి ప్రేక్షకుడి ఆలోచన మేరకు సినిమా ఎలా ఉండాలి అనే విషయంలో తండ్రి రామానాయుడు, అన్న సురేష్ బాబు హెల్ప్ చేశారు... స్వతహాగా రామానాయుడు ప్రొడ్యూసర్ కావడం వల్ల వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అతన్ని ప్రేక్షకులు ఏ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా కథలను సిద్ధం చేసేవారు...

వెంకటేష్ తీవ్రమైన కసరత్తులు చేసి తను చేసిన ప్రతి పాత్రకి ప్రాణం పోశాడు. సినిమా హిట్ అయిన ప్లాప్ అయిన నటుడిగా వెంకటేష్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. నటుడిగా ముఖానికి మేకప్ వేసుకున్న డే వన్ నుంచి ఇప్పటి వరకు ఆయన ఒకే నిబద్ధతతో ఉన్నాడు. ఏదైనా క్యారెక్టర్ ను ఒప్పుకుంటే ఆ పాత్ర ను వెంకటేష్ తప్ప ఇంకెవ్వరు చేయలేరనేలా నటించి మెప్పిస్తాడు... క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన యూనివర్సల్ హీరో వెంకటేష్...తొందర్లోనే రిలీజ్ అవ్వనున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాతో మరోసారి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు...

Tags:    

Similar News