కామ్రేడ్ అంటే కామ్‌ గా కలెక్షన్స్ రైడ్ చేయడమా?

పిల్లలకు కూడా సినిమా నచ్చుతుందని అన్నారు. సినిమా రిలీజ్ డేట్ ముందే అనుకున్నప్పటికీ సెన్సార్ ప్రాసెస్ కారణంగా కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు.

Update: 2026-10-08 06:45 GMT

కామ్రేడ్ కళ్యాణ్.. టైటిల్ వినగానే ఏదో సీరియస్ పొలిటికల్ డ్రామా అనిపించొచ్చు. కానీ సినిమాలో మాత్రం కామెడీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు దసరా సీజన్‌ లో థియేటర్లలో సందడి చేసేందుకు ఆ సినిమా రెడీ అవుతోంది. యంగ్ హీరో శ్రీవిష్ణు లీడ్ రోల్ లో నటించిన ఆ మూవీ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దసరా సెలవులు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ ను టార్గెట్ చేస్తూ సినిమాను తీసుకొస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్‌ లోని కామెడీ సన్నివేశాలు సినిమాపై ఇంట్రెస్ట్ పెంచాయి. సినిమా రిలీజ్ సందర్భంగా మూవీ టీమ్ ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌ లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. దసరా సీజన్‌ లో ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చని చెప్పారు.

పిల్లలకు కూడా సినిమా నచ్చుతుందని అన్నారు. సినిమా రిలీజ్ డేట్ ముందే అనుకున్నప్పటికీ సెన్సార్ ప్రాసెస్ కారణంగా కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. ప్రమోషన్స్‌ కు తక్కువ సమయం ఉన్నా.. వీలైనంత ఎక్కువగా ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకెళ్లామని చెప్పారు. ఇక ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సినిమాను ప్రమోట్ చేశామని, సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ అందరినీ కలుస్తామని శ్రీవిష్ణు అన్నారు.

అయితే ఆ ప్రెస్‌ మీట్‌ లో కామ్రేడ్ కళ్యాణ్ మూవీ టైటిల్‌ పై జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. కామ్రేడ్ కళ్యాణ్ అంటే సినిమా అంటూ శ్రీవిష్ణు ఫన్నీగా చెప్పగా.. వెంటనే హోస్ట్ కూడా తనదైన పంచ్ పేల్చారు. కామ్రేడ్ కళ్యాణ్ అంటే కామ్‌ గా కలెక్షన్స్ రైడ్ చేసే సినిమా అంటూ నవ్వించారు. అప్పుడు శ్రీవిష్ణు కూడా నవ్వి థ్యాంక్యూ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక కామ్రేడ్ కళ్యాణ్ మూవీ స్టోరీ 1990స్ బ్యాక్ డ్రాప్ లో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సాగుతుంది. నక్సల్స్ ప్రభావం ఉన్న ఓ గ్రామంలో తన పాత సినిమా థియేటర్‌ ను నడిపించుకోవడానికి ఓ థియేటర్ యజమాని కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎలా యూజ్ చేసుకుంటాడన్న ఇంట్రెస్టింగ్ లైన్‌ తో ఆ స్టోరీని రూపొందించారు. అయితే ఆ పాయింట్ విన్నంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్‌ గా ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు.

శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్‌ తో సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ట్రైలర్ ఫస్టాఫ్ ఫుల్ కామెడీతో సాగగా.. రెండో భాగంలో స్టోరీ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. దీంతో సినిమాలో కామెడీతో పాటు కథకు తగ్గ ఎమోషన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌ గా నటించారు. రాధిక శరత్‌ కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి శ్రీవిష్ణు చెప్పినట్టు సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో.. హోస్ట్ అన్నట్లు నిజంగానే కామ్‌ గా కలెక్షన్స్ రైడ్ చేస్తుందో లేదో అనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News