సెన్సార్ సర్టిఫికెట్ ఎఫెక్ట్ ఎంత? అసలేం జరుగుతోంది?
సినిమా రిలీజ్ కు ముందు ఇప్పుడు స్టోరీ ఏంటి.. హీరో ఎవరు.. బడ్జెట్ ఎంత అనే విషయాలతోపాటు సెన్సార్ సర్టిఫికెట్ పై కొంతకాలంగా జోరుగా చర్చ జరుగుతోంది.
సినిమా రిలీజ్ కు ముందు ఇప్పుడు స్టోరీ ఏంటి.. హీరో ఎవరు.. బడ్జెట్ ఎంత అనే విషయాలతోపాటు సెన్సార్ సర్టిఫికెట్ పై కొంతకాలంగా జోరుగా చర్చ జరుగుతోంది. యూ వచ్చిందా.. యూ/ ఏ వచ్చిందా.. ఏ వచ్చిందా అంటూ ఫ్యాన్స్, ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. కానీ అసలు సినిమా హిట్ అవుతుందా లేదా అనేది సెన్సార్ సర్టిఫికెట్ నిర్ణయిస్తుందా అంటే.. కచ్చితంగా చెప్పలేం.
ఈ మధ్య కాలంలో సెన్సార్ విషయం ఇండస్ట్రీలో చర్చకు వస్తోంది. సినిమా కంటెంట్ పై అబ్జెక్షన్స్, కొన్ని సీన్స్ విషయంలో ఛేంజెస్, సర్టిఫికెట్ విషయంలో వచ్చే డెసిషన్స్.. ఇలా రిలీజ్ కు ముందే సెన్సార్ ఒక స్పెషల్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఆ సినిమాకు సెన్సార్ నుంచి యూ/ ఏ సర్టిఫికెట్ వచ్చింది.
అయితే మూవీ ప్రెస్ మీట్ లో కోన వెంకట్ చేసిన కామెంట్స్ సెన్సార్ ప్రాసెస్ పై మరోసారి డిబేట్ స్టార్ట్ చేశాయి. సినిమా యూ, యూ/ ఏ లేదా ఏ సర్టిఫికెట్ కు సరిపోతుందా అనేది సెన్సార్ వాళ్లు డిసైడ్ చేయవచ్చని ఆయన అన్నారు. కానీ సినిమాలోని సీన్స్ ను తీసేయాలని, మార్చాలని చెప్పడం వరకు వెళ్లడం ఎందుకనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.
నిజానికి సెన్సార్ సర్టిఫికెట్ ఒక సినిమాకు మార్కెట్ పై ఎఫెక్ట్ చూపించొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు సినిమా చూడాలా వద్దా అనే విషయంలో సర్టిఫికెట్ కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ సినిమా రిజల్ట్ మాత్రం సర్టిఫికెట్ ఒక్కటే డిసైడ్ చేయదు. యూ సర్టిఫికెట్ వచ్చిన సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చకపోతే థియేటర్లలో నిలబడదు. అదే యూ/ ఏ లేదా ఏ సర్టిఫికెట్ వచ్చిన సినిమా కూడా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే భారీ విజయాన్ని అందుకోవచ్చు.
చివరికి ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లిన తర్వాత సినిమా ఎలా ఉందనేదే చూస్తాడు. స్టోరీ, యాక్టింగ్, కామెడీ, ఎమోషన్, యాక్షన్.. ఇలా సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ అసలు రిజల్ట్ డిసైడ్ చేస్తుంది. ఇక మరోవైపు ఓటీటీ విషయంలో కూడా కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద హీరో ఉన్నాడని మాత్రమే ఓటీటీ సంస్థలు సినిమా కొనడానికి ముందుకు రావని ఆయన అన్నారు. సినిమా మొత్తాన్ని చూసిన తర్వాతే దాన్ని తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.
అంటే థియేటర్ అయినా.. ఓటీటీ అయినా.. చివరకు కంటెంట్ కే వాల్యూ పెరుగుతోందన్నమాట. ఇక కామ్రేడ్ కళ్యాణ్ విషయానికి వస్తే శ్రీ విష్ణు, మహిమ నంబియార్ జంటగా నటించారు. కామెడీ, ప్రేమ, యాక్షన్ తో పాటు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కింది. జానకిరామ్ మల్లెల దర్శకత్వం వహించిన ఆ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న కామ్రేడ్ కళ్యాణ్ కు వచ్చిన యూ/ ఏ సర్టిఫికెట్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది.. సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.