అఫిషియల్ : భారతీయుడి పునరాగమనం కన్ఫర్మ్
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'ఇండియన్ 2' సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'ఇండియన్ 2' సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఇండియన్ 2 సినిమా విడుదల సమయంలోనే ఇండియన్ 3 ఉంటుందని, అందులోనే మ్యాటర్ ఎక్కువ ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు పదే పదే చెబుతూ వచ్చారు. అయితే ఇండియన్ 2 సినిమా ఫెయిల్యూర్ కారణంగా ఇండియన్ 3 విడుదలకు అవాంతరాలు ఎదురు అయ్యాయి. ముఖ్యంగా నిర్మాణ సంస్థతో దర్శకుడికి ఉన్న విభేదాల కారణంగా సినిమా విడుదల కావడం లేదు అనే పుకార్లు పెద్ద ఎత్తున వచ్చాయి. అందులో ఎంత నిజం ఉంది అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇండియన్ 3 సినిమా గురించి అంతా మర్చిపోతున్న సమయంలో అనూహ్యంగా చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
ఇండియన్ 3 సినిమా విషయమై...
సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో ముగ్గురు యోధులు గుర్రాలపై స్వారీ చేస్తున్నట్లు చూపించారు. ఆ ఫోటోకు సేనాపతి తిరిగి వచ్చాడు.. ఇక ఎలాంటి సహనం లేదు అంటూ కామెంట్ పెట్టారు. అంతే కాకుండా భారతీయుడి పునరాగమనం కన్ఫర్మ్ అన్నట్లుగా అందులో పేర్కొన్నారు. గతంలో శంకర్ చెప్పిన దాని ప్రకారం ఇండియన్ 3 సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలి ఉంది. ఇప్పుడు ఆ వర్క్ ను పూర్తి చేశారా లేదంటే ఇప్పుడు వర్క్ ప్రారంభిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే ఇండియన్ 3 సినిమా పట్టాలు ఎక్కింది, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనేది కన్ఫర్మ్. కమల్ అభిమానులకు ఇది కచ్చితంగా పెద్ద శుభవార్త అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సేనాపతి మళ్ళీ రాబోతున్నాడు..
గతంలో వచ్చిన ఇండియన్ 2 లోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను రివీల్ చేశారు, అంతే కాకుండా ట్రైలర్ కూడా వైరల్ అయింది. దాంతో ఇండియన్ 2 కంటే ఇండియన్ 3 కచ్చితంగా బాగుంటుందని అంతా భావించారు. కానీ ఇండియన్ 3 వెంటనే రాలేదు. ఇండియన్ 2 వచ్చి రెండేళ్లు దాటింది. ఇప్పుడు ఇండియన్ 3 రాబోతుంది. ఈతరం యువతను ఆకర్షించే ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు. కనుక సినిమాపై అప్పుడు ఆసక్తి పెరిగింది. తీరా చూస్తే సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. కానీ ఇండియన్ 3 విషయంలో అలా కాదని బల్ల గుద్ది మరీ మేకర్స్ చెబుతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
కమల్ హాసన్ ఫ్యాన్స్ కోసం...
ఇండియన్ 3 అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌లో సేనాపతి తిరిగి వస్తున్నాడు అంటూ పేర్కొన్నారు. కానీ ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అనే విషయాలపై క్లారిటీ లేదు. అంటే సినిమాను ఆ మధ్య డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారు అనే వార్తలు వచ్చాయి. కనుక ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ చేస్తారా లేదంటే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఓటీటీ ద్వారా అయితే ముందుగానే పోస్టర్‌లో పేర్కొనే వారు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ కోసం ఇండియన్ 3 ను రెడీ చేస్తున్నారు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అది ఎప్పుడు, ఈ ఏడాది చివరి వరకు సినిమా వస్తుందా అనే చర్చకు మాత్రం సమాధానం లేదు. ప్రస్తుతం శంకర్ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. కనుక ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని కమల్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు సిద్దార్థ్, ఎస్ జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, వివేక్, ఢిల్లీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.