• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ సినిమాలకు సాయి...

స్టార్ సినిమాలకు సాయి పల్లవి నాట్ ఇంట్రెస్టెడ్..!

| కెరీర్ మొదటి నుంచి సెలెక్టెడ్ సినిమాలతోనే చేతూ వస్తున్న సాయి పల్లవి రెగ్యులర్ హీరోయిన్లకు తనకు చాలా డిఫరెన్స్ ఉందని ప్రూవ్ చేస్తూ వస్తుంది

By - Tupaki Desk
Update: 2023-08-29 06:28 GMT

కెరీర్ మొదటి నుంచి సెలెక్టెడ్ సినిమాలతోనే చేతూ వస్తున్న సాయి పల్లవి రెగ్యులర్ హీరోయిన్లకు తనకు చాలా డిఫరెన్స్ ఉందని ప్రూవ్ చేస్తూ వస్తుంది. మలయాళ ప్రేమతో క్రేజ్ తెచ్చుకుని తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సూపర్ పాపులర్ అయ్యింది. సాయి పల్లవి స్టార్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఓకే అంటే చాలు అడిగినంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. కానీ అమ్మడు మాత్రం ఏ సినిమా పడితే అది చేసేందుకు రెడీగా లేదు. లాస్ట్ ఇయర్ విరాటపర్వం, గార్గి సినిమాలు చేసిన సాయి పల్లవి ఆ తర్వాత ఏ సినిమాకు సైన్ చేయలేదు.

ఈమధ్య స్టార్ సినిమా ఆఫర్ రాగా ఆ ప్రాజెక్ట్ కి నో చెప్పిందట అమ్మడు. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి తెలుగు సినిమాలకు గ్యాప్ ఇస్తుంది. తనకు నచ్చిన కథలు రాకపోవడం వల్లే సాయి పల్లవి ఇక్కడ సినిమాలు చేయట్లేదని తెలుస్తుంది. మిగతా హీరోయిన్స్ అంతా కూడా ఆఫర్ వస్తే చాలు సినిమా కోసం ఏం చేయడానికైనా రెడీ అనేస్తున్నారు. కానీ సాయి పల్లవి వాళ్లలా కాకుండా తన పంథా తనదే అన్నట్టు ఉంది.

టాలీవుడ్ లో స్టార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కొన్నిసార్లు మాత్రమే డిమాండ్ ఉంటుంది. కథలో కథానాయిక పాత్ర వెయిట్ లేనప్పుడు సాయి పల్లవి లాంటి నటీమణులు ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించరు. అది ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా వాళ్లు ఎంత రెమ్యునరేషన్ ఇస్తానన్నా సరే సాయి పల్లవి నో చెప్పేస్తుంది. అయితే వీటి వల్ల సినిమాల కౌంట్ తగ్గినా అమ్మడు వాటి గురించి పట్టించుకోనవసరం లేదని అంటుంది.

సాయి పల్లవి నెక్స్ట్ సినిమా కోసం ప్రేక్షకులంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆమె మాత్రం సినిమాల విషయంలో దూకుడు చూపించట్లేదు. తనకు పోటీ వచ్చేలా నటించే కథానాయికలు ఉన్నా సరే సినిమాల సెలక్షన్ లో తన దారి తనదే అనేలా ప్రవర్తిస్తుంది సాయి పల్లవి. లేడీ పవర్ స్టార్ క్రేజ్ తో తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సాయి పల్లవి సినిమాల వేగం పెంచితే బెటర్ అని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయి పల్లవి ఫ్యాన్స్ కోసం అయినా సరే సినిమాల వేగం పెంచి అలరించాలని ఆశిద్దాం.

Tags:    
  • Saipallavi 
  • Premamfilm 
  • Tollywoodactress 
  • Tamilmovie 
  • Actresssaipallavi 
  • Shivakarthikeyan 
  • Filmindustry 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS