• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని హీరోయిన్ పోస్ట్.....

నాని హీరోయిన్ పోస్ట్.. పెళ్లా? సినిమానా?

| వారిద్దరి కాంబోలో వచ్చిన నిన్ను కోరి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత జై లవకుశలో ఎన్టీఆర్ సరసన అదరగొట్టేసింది

By - Tupaki Desk
Update: 2024-06-24 13:05 GMT

కేరళ బ్యూటీ నివేదా థామస్ కు టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. కోలీవుడ్, మాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్న ఈ భామ.. తెలుగులో కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. నేచురల్ స్టార్ నాని జెంటిల్ మేన్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నివేద.. తొలి సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో రెండో మూవీ కూడా నానితోనే చేసింది ఈ బ్యూటీ.

వారిద్దరి కాంబోలో వచ్చిన నిన్ను కోరి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత జై లవకుశలో ఎన్టీఆర్ సరసన అదరగొట్టేసింది. అలా టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది నివేద. జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118లో నటించిన ఆమె.. బ్రోచేవారెవరురాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దర్బార్ చిత్రంలో రజినీ కాంత్ కుమార్తెగా కనిపించింది. పవన్ వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు భామల్లో మెయిన్ లీడ్‌ గా యాక్ట్ చేసింది.

అయితే ఈమధ్య సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చింది నివేద. చివరగా శాకినీ డాకినీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరియన్ రీమేక్ గా వచ్చిన ఆ సినిమా.. మూవీ లవర్స్ ను మెప్పించలేకపోయింది. నివేదా, రెజీనా నటించిన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. బ్రోచెవారెవరురా మూవీనే ఆమెకు చివరి హిట్ అని చెప్పాలి. అయితే శాకినీ డాకినీ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా అనౌన్స్ చేయలేదు నివేదా థామస్.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టింగ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. సోదరుడితో కలిసి వేసే స్టెప్పులు, చేసే డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇటీవల ఆమె ఫోటోకు అనేక మంది నెటిజన్లు.. తప్పుగా కామెంట్లు పెట్టారు. ఆమె పోజుకు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. కానీ వాటిపై నివేద స్పందించలేదు. ఇప్పుడు ఆమె చేసిన లేటెస్ట్ పోస్ట్ వైరల్ గా మారింది.

'చాలా కాలం గడిచింది.. బట్ ఫైనల్లీ' అంటూ రాసుకొచ్చింది నివేద. లవ్ ఎమోజీని కూడా యాడ్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని కొందరు చెబుతున్నారు. మరికొందరు కొత్త సినిమాను అనౌన్స్ చేయనుందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. మరి నివేదా థామస్ పెళ్లి గురించి పెట్టిందా? లేక సినిమా కోసమా? అనేది ఆమెనే క్లారిటీ ఇస్తే తెలుస్తుంది.

It’s been a while….. but. Finally! ❤️

— Nivetha Thomas (@i_nivethathomas) June 24, 2024
Tags:    
  • Malayalamactress 
  • Nivethathomas 
  • Tollywood 
  • Gentlemanmovie 
  • Nani 
  • Filmindustry 
  • Ninnukori 
  • Jailavakusa 
  • Nivethathomascareer 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS