నయన్ 40 వస్తున్నా తరగని అందం.. ఇది సీక్రెట్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ఉన్న అందాల భామ నయనతార

Update: 2024-02-27 04:13 GMT

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ఉన్న అందాల భామ నయనతార. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ కూడా ఆమెనే తీసుకుంటుంది. నయనతార ఐదు కోట్లకి పైగా ఒక్కో సినిమాకి తీసుకుంటుంది. అది కూడా సెలక్టివ్ గానే సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా తమిళంలో అయితే ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ తో లేడీ సూపర్ స్టార్ అనే గుర్తియింపుని నయనతార సొంతం చేసుకుంది.

ఆమె 2003లో మాతృభాష మలయాళంలో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. అయితే సౌత్ లో అందరికి బాగా చేరువ అయ్యింది మాత్రం చంద్రముఖి మూవీతోనే. ఆమె కెరియర్ లో ఐదో చిత్రంగా ఇది వచ్చింది. దీని తర్వాత 2006లో లక్ష్మి సినిమాతో నయనతార టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది.

వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్ భాషలలో స్టార్స్ అందరితో నయనతార ఆడిపాడింది. గత ఏడాది జవాన్ మూవీతో అమ్మడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా మొదటి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. వయస్సు పెరుగుతున్న కొద్ది హీరోయిన్స్ గ్లామర్ తగ్గుతూ ఉంటుంది.

అయితే నయనతార మాత్రం వయస్సు పెరుగుతున్న మరింత అందంగా, నిగారింపుతో మెరిసిపోతోంది. పెర్ఫెక్ట్ ఫిట్నెస్ తో అందరిని ఆకట్టుకుంటుంది. విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నయనతార నటిగా తన కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. 40 ఏళ్ళ వయస్సులో కూడా నయనతార ఇంత అందంగా ఉండటానికి కారణం యోగా అంటా.

ఆమె నిత్యం యోగా చేయడంతో పాటు, సరైన నిద్ర మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. అనవసరమైన టెన్షన్ లు ఏవీ మనస్సుకి ఎక్కించుకోదు. అలాగే సినిమా షూటింగ్ ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉంటుంది. ఈ కారణాల వలన వయస్సు పెరిగిన వన్నె తగ్గని అందంతో, అదిరిపోయే స్మైల్ తో నయనతార అందరిని ఆకట్టుకుంటుంది.

Tags:    

Similar News