• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిగ‌రెట్ తాగుతూ...

సిగ‌రెట్ తాగుతూ కెమెరాల‌కు చిక్కిన న‌టి

| ఈ వీడియోలో కృతి సిగరెట్ తాగుతూ క‌నిపించడంతో నెటిజ‌నుల్లో ఇది హాట్ టాపిగ్గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-07-30 12:01 GMT

కృతి సనన్ రెగ్యుల‌ర్‌గా ఏదో ఒక కారణంతో వార్త‌ల్లో నిలుస్తోంది. ఇటీవ‌ల‌ తన సినిమాలతో కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగా గాసిప్స్ లో కి వ‌స్తోంది. ఇంత‌కుముందే త‌న ప్రియుడు, బిజినెస్‌మేన్ క‌బిర్ బాహియాతో క‌లిసి ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. అత‌డితో కృతి ప్రేమ‌లో ఉందంటూ ప్ర‌చారం సాగింది. ప్ర‌స్తుతం గ్రీస్ విహార‌యాత్ర నుంచి కృతి వీడియో ఒక‌టి అంత‌ర్జాలంలోకి వ‌చ్చింది. అందులో ఈ భామ ఊహించ‌ని విధంగా క‌నిపించింది. ఈ వీడియోలో కృతి సిగరెట్ తాగుతూ క‌నిపించడంతో నెటిజ‌నుల్లో ఇది హాట్ టాపిగ్గా మారింది.

కృతి స‌నోన్ ఇటీవల తన 34వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సంద‌ర్భంగా బర్త్ డే వేడుక‌ల ఫోటోలు వీడియోలు సెన్సేష‌న్ గా మారుతున్నాయి. గ్రీస్ నుంచి కృతి షేర్ చేసిన ఫోటోల‌లో సిగరెట్ తాగుతున్న వీడియో ప్ర‌ధానంగా ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. కృతి సనన్ గ్రీస్‌లోని మైకోనోస్ ద్వీపంలో బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకున్న‌ప్ప‌టి ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ భామ‌ ఆరెంజ్ బ్రాలెట్, బ్లూ డెనిమ్‌లో ఉన్న ఫోటోలు వీడియోలు క‌నిపించాయి. ఇవే కాకుండా సిగరెట్ తాగుతున్న వీడియో అంద‌రి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఈ వీడియోను రెడ్డిట్ వినియోగదారు షేర్ చేసారు. తర్వాత ఇది సోషల్ మీడియాల‌లో కూడా షేర్ అయింది.

వీడియో వైర‌ల్ కాగానే ట్విస్టు:

తాజా వైరల్ వీడియోలో నారింజ రంగు దుస్తులు ధరించిన మహిళ ధూమపానం చేస్తూ కనిపించింది. ఆ మహిళ కృతి సనన్ అని నెటిజ‌నులు పేర్కొంటున్నారు. అదే సమయంలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కృతి తల్లి గీతా సనన్ పాత ట్వీట్ ఒక‌టి వెబ్ లోకి వ‌చ్చింది. అందులో త‌న కుమార్తె కృతిని ధూమపానానికి దూరంగా ఉండే అమ్మాయి అని అభివర్ణించింది. దీంతో నారింజ రంగు దుస్తులు ధ‌రించిన‌ది కృతియేనా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

నిజానికి `బరేలీ కి బర్ఫీ`లో ఓ సన్నివేశం కోసం కృతి పొగతాగాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఇప్పుడు వైర‌ల్ చేస్తున్నారు. ఇంత‌లోనే కృతి సిగరెట్ తాగుతుందనే అనుమానాలను ప‌టాపంచ‌లు చేస్తూ.. కృతి ధూమపానం చేయదని చుట్టుపక్కల వారు కూడా స్మోకింగ్ చేయకూడదని గీతా సనన్ ఆ స‌మ‌యంలో చెప్పిన మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి. గతంలో మిడ్ డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి తాను ధూమపానం చేయనని ప్రకటించింది. ఓ సినిమా కోసం పాత్ర డిమాండ్‌ మేరకే సిగరెట్‌ తాగాను అని వెల్ల‌డించింది.

కృతి సనన్ త‌దుప‌రి సినిమాల విష‌యానికి వ‌స్తే... ఈ సంవత్సరం క్రూ థియేటర్లలోకి వచ్చింది. దిల్జిత్ దోసాంజ్‌తో కృతి కెమిస్ట్రీ ప్రశంస‌లు అందుకుంది. అలాగే `దో పట్టి`లో కనిపించనుంది. కృతి సొంత నిర్మాణ సంస్థ‌లో రూపొందిస్తున్న చిత్ర‌మిది. ఇది కాకుండా అక్షయ్ కుమార్ సినిమాలోను న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

Kristi Sanon smoking in Greece
byu/Stunning_Cow_5233 inBollyBlindsNGossip
Tags:    
  • Bollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • Actress 
  • KritiSanon 
  • Birthdaywishes 
  • Viralvideo 
  • Smokingvideo 
  • Socialmedia 
  • KabirBahia 
  • Mykonos 
  • Greece 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS