• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌తి చెడే ట్రీటిచ్చిన...

మ‌తి చెడే ట్రీటిచ్చిన స్టార్ క్రికెట‌ర్ వైఫ్

| ప్ర‌పంచ‌క‌ప్ 2023 క్రికెట్‌ని ఆస్వాధిస్తున్న వారికి ఆథియా శెట్టి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇండియా ఆడే ప్ర‌తి మ్యాచ్ లో ఈ అమ్మ‌డు సంద‌డి చేస్తోంది

By - Tupaki Desk
Update: 2023-11-10 16:02 GMT

ప్ర‌పంచ‌క‌ప్ 2023 క్రికెట్‌ని ఆస్వాధిస్తున్న వారికి ఆథియా శెట్టి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇండియా ఆడే ప్ర‌తి మ్యాచ్ లో ఈ అమ్మ‌డు సంద‌డి చేస్తోంది. టీమిండియా ట్యాలెంటెడ్ బ్యాట్స్‌మ‌న్ కె.ఎల్.రాహుల్ ని పెళ్లాడిన గ‌డుస‌రిగా ఆథియా శెట్టికి గుర్తింపు ఉంది. ఆరంభం మోడలింగ్ చేసి, అటుపై బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో న‌టించిన ఈ బ్యూటీ కెరీర్ ఆశించినంత‌గా వెల‌గ‌లేదు. అదే క్ర‌మంలో టీమిండియా క్రికెట‌ర్ కె.ఎల్.రాహుల్ తో ప్రేమాయ‌ణం స్టోరీలు మీడియాలో సంచ‌ల‌నంగా మారాయి. ఇంత‌కుముందే పెద్ద‌ల అంగీకారంతో ఈ జంట వివాహం అయింది. ఇప్పుడు ఆథియా శెట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ల వీక్ష‌ణ‌తో అంద‌రి దృష్టిలో పడుతోంది. హ‌బ్బీ రాహుల్ చెల‌రేగి బౌండ‌రీలు త‌ర‌లిస్తుంటే ఆడిటోరియంలో ఆథియా ఆనందోత్సాహాలు కెమెరా కంటికి చిక్కుతున్నాయి. ఆ ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.


ఇక ఆథియా శెట్టి బాలీవుడ్ లో అరుదైన ఫ్యాష‌నిస్టాగా గుర్తింపు తెచ్చుకుంది. యూనిక్ స్టైల్ ఫ్యాష‌న్ సెన్స్ తో ఈ బ్యూటీ ఇప్ప‌టికే భారీ ఫాలోయింగ్ ని సంపాదించింది. గాంభీర్యం - గ్లామర్‌ను నైపుణ్యంగా మిళితం చేసి అరుదైన ఫ్యాష‌న్ సెన్స్ తో ఆక‌ట్టుకుంటోంది అథియా శెట్టి. ఇటీవల గ్రాజియా మ్యాగజైన్ కవర్‌పై కనిపించిన ఈ బ్యూటీ అద్భుతమైన వ్యక్తిత్వం విభిన్న‌మైన‌ శైలితో మైమ‌రిపించింది.

అథియా శెట్టి లేటెస్ట్ గ్రాజియా కవర్ షూట్ ఒక విజువల్ ఫీస్ట్. ఇందులో తనదైన‌ ప్రత్యేకమైన శైలిని అద్భుతంగా ఆవిష్క‌రించింది ఆథియా. ఎంతో విశ్వాసంతో ప్ర‌శాంతంగా కవర్ షూట్ లో పాల్గొంది ఈ బ్యూటీ. అథియా తన అద్భుతమైన కోచర్ వస్త్రధారణతో ఆక‌ట్టుకుంది. ఇక ఈ ఫోటోషూట్ లో అథియా శెట్టి ప్రకాశవంతమైన బంగారు రంగు దుస్తులలో మెరుపులు మెరిపించింది. స్టైల్ ఎలివేష‌న్ తో పాటు తాను సౌకర్యంగా ఉండగలదని ఈ డ్రెస్ నిరూపించింది. అథియా గ్లామ్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే.. ఇత‌ర‌ ఫ్యాషన్ స్పెష‌లిస్టుల కంటే గ్లామరస్‌గా ఉంది. రాహుల్ మిశ్రా షాపుల నుండి ఎంపిక చేసిన‌ స్టైలిష్ గోల్డెన్ డ్రెస్‌లో భారీ 3డి పూల ఎంబ్రాయిడరీ - నెక్‌లైన్ డిజైన్ షో స్టాప‌ర్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆథియా న‌టించిన చివ‌రి సినిమా 2029లో విడుద‌లైంది. ఆ త‌ర్వాత పూర్తిగా న‌ట‌న‌కు దూర‌మైంది. తిరిగి ఇప్పుడు న‌టిగా రంగప్ర‌వేశం చేయ‌నుంద‌ని స‌మాచారం. అలాగే నిర్మాత‌గాను త‌న‌కంటూ ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌ని కూడా తెలుస్తోంది. మునుముందు వెబ సిరీస్ లు, సినిమాల‌ను నిర్మించేందుకు ఆథియా ప్లాన్ చేస్తోంద‌ని టాక్.

Tags:    
  • Graziaindia 
  • Athiyashetty 
  • Athiya 
  • Phototalk 
  • Filmindustry 
  • Actressathiyashetty 
  • Novembercover 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS