• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయి పల్లవి ఆర్మీ...

సాయి పల్లవి ఆర్మీ డ్రీమ్..!

| డైరెక్టర్ కథ చెప్పినప్పటి నుంచి సినిమాకు కనెక్ట్ అయ్యానని. ఇక రియల్ లైఫ్ పాత్రని చూసి చాలా స్పూర్తి పొందినట్టు చెప్పారు సాయి పల్లవి.

By - Tupaki Desk
Update: 2024-10-30 09:11 GMT

ఎలాంటి పాత్ర చేసినా ఆ నటనతో మార్కులు కొట్టేసే కథానాయిక సాయి పల్లవి లేటెస్ట్ గా అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివ కార్తికేయన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాను ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కింది. సినిమాలో ముకుంద్ వైఫ్ ఇందుగా సాయి పల్లవి నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ కథ చెప్పినప్పటి నుంచి సినిమాకు కనెక్ట్ అయ్యానని. ఇక రియల్ లైఫ్ పాత్రని చూసి చాలా స్పూర్తి పొందినట్టు చెప్పారు సాయి పల్లవి. ఆర్మీ మ్యాన్ ఫ్యామిలీ గురించి వారి స్ట్రగుల్స్ గురించి చాలా న్యాచురల్ గా ఈ సినిమాలో చూపించారని చెప్పారు సాయి పల్లవి. ఐతే రియల్ లైఫ్ లో తను ఆర్మీ ఆఫీసర్ ని పెళ్లాడితే అతనితో పాటు తాను కూడా ఆర్మీలో జాయిన్ అవుతానని అంటుంది సాయి పల్లవి.

సాయి పల్లవి ఏదైనా పాత్ర ఎంచుకుంది అంటే ఆ సినిమాకే స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా తెలుగులో సాయి పల్లవి క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. విరాటపర్వం తర్వాత తెలుగులో తండేల్ చేస్తున్న సాయి పల్లవి ఆ సినిమా కన్నా ముందు అమరన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెర మీద సాయి పల్లవిని చూడాలని కోరుకుంటున్న ఆమె ఫ్యాన్స్ కి అమరన్ ఒక మంచి ఎమోషనల్ మూవీగా అలరించనుంది.

అమరన్ సినిమా అడివి శేష్ మేజర్ సినిమాకు కొనసాగింపుగా ఆ సినిమా ఇచ్చిన స్పూర్తిని మరింత స్ట్రాంగ్ చేస్తుందని అన్నారు సాయి పల్లవి. మేజర్, అమరన్ రెండు కథలు వేరే కానీ ఆర్మీ ఆఫీసర్స్ మీద ఈ రెండు సినిమాలు రెస్పెక్ట్ తెచ్చేలా చేస్తాయని అన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఆర్మీకు వెళ్లడం అనే విషయంపై సినిమా చూసిన ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకుంటారని చెప్పారు.

ఇక నాగ చైతన్యతో తండేల్ చేస్తున్న సాయి పల్లవి. ఆ సినిమాలో కూడా అద్భుతమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో కూడా సాయి పల్లవి తన సత్తా చాటేలా కనిపిస్తుంది. తెలుగు ఆడియన్స్ కు తండేల్ తో సర్ ప్రైజ్ చేయనున్న సాయి పల్లవి అమరన్ లో కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.

Tags:    
  • Saipallavi 
  • Actress 
  • Amaran 
  • Sivakarthikeyan 
  • Kollywood 
  • Filmindustry 
  • Armyofficer 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS