టీచ‌ర్ల‌పై ప‌గ‌ప్ర‌తీకారంతో ఆనటుడు ఏం చేసాడంటే?

బాల్య మిత్రులైనా..బాల్యంలో పాఠాలు బోధించిన గురువులైనా ప్రతీ ఒక్క‌రి జీవితంలో ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటారు

Update: 2024-05-08 05:57 GMT

బాల్య మిత్రులైనా..బాల్యంలో పాఠాలు బోధించిన గురువులైనా ప్రతీ ఒక్క‌రి జీవితంలో ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటారు. చిన్న నాటి జ్ఞాప‌కాలు ఎప్ప‌టికీ మ‌ధురానుభూతులుగా భావిస్తుంటాం. ముఖ్యంగా స్కూల్ డేస్ అంటే? అంద‌రికీ ఓ గొప్ప జ్ఞాప‌కం. ఏ మాష్టారు ఎలా పాఠాలు చెప్పేవారు? ఏ మాష్టారు ఎలా దెబ్బ‌లు వేసేవారు? ఇలా ప్ర‌తీది ఓ గొప్ప మోమోరీగా ప్ర‌తి ఒక్క‌రికి ఉండిపోతుంది. టీచ‌ర్ కొట్టాడ‌ని..తిట్టాడ‌ని కోపం వ‌చ్చినా అది ఆ క్ష‌ణం మాత్ర‌మే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అంతా మామూలుగానే ఉంటుంది.

అదే టీచ‌ర్ పాఠాలు బోధిస్తుంది....శ్ర‌ద్దగా విద్యార్ధులు వింటారు. కానీ ఈ కుర్రాడు కమ్ న‌టుడు మాత్రం అందుకు భిన్నం. చిన్న‌ప్పుడు పెరిగిన ప‌గ ప్ర‌తీకారంతో ఆ న‌టుడు ఆస్కూల్ ని ఏం చేసాడో? తెలిస్తే షాక్ అవుతాం. ట‌ర్కీష్ కి చెందిన ఓ న‌టుడు చిన్న‌ప్పుడు చ‌దువుకున్న ఓస్కూల్ ని సొంత డ‌బ్బుతో కొనుగులో చేసి ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూల్చేసాడు. బిల్డింగ్ మొత్తాన్ని డిమోలిష్ చేసి ఆ ప్రాంతాన్ని నునుపుగా చేసేసాడు. పాత బిల్డింగ్ క‌దా? అందుకే అలా చేసాడు? కొత్త‌గా మరో బిల్డింగ్ ఏదైనా క‌ట్టిస్తాడు? అనుకుంటున్నారా? ఏంటి అలాంటి ఆలోచ‌నేమి అత‌డికి లేదు.

Read more!

చిన్న‌ప్పుడు టీచ‌ర్లు త‌నని కొట్టార‌ని.. పంగ పెంచుకుని ఆ ప‌గ‌ని పెద్ద‌య్యాక కూడా అలాగే కొన‌సాగించి జీవితంలో బాగా స్థిర‌ప‌డిన త‌ర్వాత ఆ స్కూల్ బిల్డింగ్ కొని దాన్ని కూల్చేసి ఆనంద ప‌డ్డాడు. కూల్చేసిన త‌ర్వాత ఓ ఫోటో కూడా దిగాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అత‌డు చేసిన ప‌ని చూసి కొంద‌రు పాజిటివ్ గా పోస్టులు పెడుతుంటే మ‌రికొంత మంది నెగిటివ్ గానూ కామెంట్లు పెడుతున్నారు.

ఏది ఏమైనా త‌న సొంత డ‌బ్బుతోనూ కొనుకున్న బిల్డింగ్ ని ఏదైనా చేసుకునే అధికారం అత‌డికి ఉంటుంది. కానీ కూల్చేసిన త‌ర్వాత వాళ్ల‌పై కోపంతోనే ఇలా చేసాను అన‌డం మాత్రం స‌బ‌బు గా లేదంటున్నారు మ‌రికొంత మంది. అదీ మ్యాట‌ర్.

Tags:    

Similar News