ఓజీ సీక్రెట్స్ బయటపెట్టిన యాక్టర్

పవర్ స్టాన్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ కూడా ఒకటి. ఇప్పటి వరకు అయితే, అధికారికంగా మూవీ టైటిల్ ప్రకటించలేదు.;

Update: 2023-09-02 09:12 GMT

పవర్ స్టాన్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ కూడా ఒకటి. ఇప్పటి వరకు అయితే, అధికారికంగా మూవీ టైటిల్ ప్రకటించలేదు. కానీ, వర్కింగ్ టైటిల్ గా ఓజీ ( ఓన్లీ గ్యాంగ్ స్టార్) గా పిలుస్తున్నారు. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. గత ఐదేళ్లుగా పవన్ కేవలం రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఆయన నుంచి వస్తున్న స్ట్రయిట్ మూవీ ఇదే కావడం విశేషం. దీంతో, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా, ఈ మూవీ గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను ప్రముఖ వర్సిటైల్ యాక్టర్ అజయ్ ఘోష్ రివీల్ చేశారు. ఈ ఓజీ మూవీలో అజయ్ ఘోష్ కూడా నటిస్తున్నాడట. తాను కూడా గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నట్లు చెప్పాడు. అయితే, ఆ రోల్ కూడా చాలా కామెడీగా ఉంటుందట. తనతో పాటు సీనియర్ నటుడు జీవా కూడా గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పారు.

అయితే, తాము రిటైర్డ్ గ్యాంగ్ స్టర్స్ లా కనిపిస్తామని, తమ పాత్రలు చాలా ఫన్నీగా ఉంటాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొద్ది రోజులు షూటింగ్ చేశామని, ఇంకా ఐదు, ఆరు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని చెప్పాడు. ఆయన చెప్పిన విషయాలను పట్టి, ఓజీ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుందని తెలుస్తోంది.

ఈ ఓజీ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి హైప్ వచ్చింది. పవన్ లుక్ కూడా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హై-ఆక్టేన్ యాక్షన్-థ్రిల్లర్‌ జోనర్ లో మూవీ సాగుతుంది. వచ్చే ఏడాది అంటే 2024 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పవన్ గ్యాంగ్ స్టర్ ఎలా ఆకట్టుకుంటాడో తెలియాలంటే, విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News