• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్యాన్సర్‌ తో చిన్నారి...

క్యాన్సర్‌ తో చిన్నారి పోరాటం.. అడివి శేష్ స్పెషల్ సర్ ప్రైజ్

| క్యాన్సర్‌ తో పోరాడుతున్న చిన్ని పాపకు సర్ప్రైజ్ చేయడంతో పాటు రోజంతా ఆమెతో సమయాన్ని గడిపారు.

By - Tupaki Desk
Update: 2024-07-20 15:00 GMT

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్.. రీల్‌ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్‌ లో కూడా హీరో అని నిరూపించుకున్నారు. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సమాజానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలో పాల్గొనే అడివి శేష్.. బిజీ షెడ్యూల్స్ లో కూడా ఓ చిన్నారి ముఖంలో ఆనందం వెల్లువిరిసేలా చేశారు. క్యాన్సర్‌ తో పోరాడుతున్న చిన్ని పాపకు సర్ప్రైజ్ చేయడంతో పాటు రోజంతా ఆమెతో సమయాన్ని గడిపారు.


క్యాన్సర్ తో బాధపడుతున్న ఆ చిన్నారికి చిన్నప్పటి నుంచి అడివి శేష్ అంటే చాలా ఇష్టం. కొన్ని నెలల క్రితం ఆమె క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. అప్పుడు తన ఫేవరెట్ హీరోను కలవాలని అనుకుంది. ఈ విషయం సన్నిహితుల ద్వారా తెలుసుకున్నారు అడివి శేష్. చిన్నారి పేరెంట్స్ తో టచ్ లో ఉన్నారు. వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. అవసరం అయినప్పుడు తన సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని మాట ఇచ్చారు.

తాజాగా కన్సల్టేషన్ కోసం హైదరాబాద్‌ కు వచ్చిన చిన్నారి ఫ్యామిలీ కోసం ఒక హోటల్‌ లో డే అవుట్ ను ప్లాన్ చేశారు అడివి శేష్. అక్కడ చిన్నారిని కలసి ఆయన సర్ప్రైజ్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే హోటల్ రూమ్ లోకి అడివి శేష్ రాగానే.. చిన్నారి సంబరపడిపోయింది. ఆమె ఫోటోలు చూసి మురిసిపోయిన అడివి శేష్.. చిన్నారితో ముచ్చటించారు.

పాపతో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు అడివి శేష్. రకరకాల బొమ్మలతో ఆడించారు. చిన్నారిని ఎత్తుకుని ఆమె ఆనందపడేలా చేశారు. పాప పేరెంట్స్ తో కూడా మాట్లాడారు. ప్రస్తుతం అడివి శేష్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. చిన్నారి తన బాధను మర్చిపోయేలా చేశారని నెటిజన్లు అంటున్నారు. శభాష్ అన్న అంటూ కొనియాడుతున్నారు.

ఇక అడివి శేష్ కెరీర్ విషయానికి వస్తే.. సొంతం మూవీలో చిన్న పాత్రలో కనిపించి 8 ఏళ్లు గ్యాప్ తీసుకున్నారు అడివి శేష్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పంజా మూవీలో విలన్ పాత్రలో మెప్పించారు. హీరోగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. వరుస సినిమాలతో మంచి హిట్లు అందుకున్నారు. హిట్ సెకండ్ కేస్ తర్వాత రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా, రైటర్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఏదేమైనా అడివి శేష్ చిన్నారికి ఇచ్చిన సర్ప్రైజ్ అద్భుతం!

#AdiviSesh's Heartwarming Act of Kindness

In an inspiring and touching gesture, Hit Machine @AdiviSesh recently reached out to surprise a little girl battling cancer, bringing joy to her.

His genuinly loving heart has left a lasting impact in both the little girl and her… pic.twitter.com/s56KXZRPrJ

— Tupaki (@tupaki_official) July 20, 2024
Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • G2 
  • Dacoit 
  • AdiviSesh 
  • ShrutiHaasan 
  • SmallGirl 
  • Child 
  • Cancer 
  • HealthConditions 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS