ఇష్టమైన వారి కోసం అన్ని ఇచ్చేసానంటూ సంచలన పోస్ట్!
ఆ మధ్య అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యారాయ్ దూరంగా ఉంటున్నారని. విడాకులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.;

బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ బాలీవుడ్ సహా అన్ని పరిశ్ర మల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే అభిషేక్ బచ్చన్ నుంచి ఇలాంటి పోస్ట్ ఎన్నడు ఊహించలేదు. తొలిసారి ఈ పోస్ట్ ప్రకంపనలు రేపుతుంది. ఆయన ఎందుకంతలా మదన పడుతున్నాడనే చర్చ షురూ అయింది. ఇంతకీ ఆయన పోస్ట్ లో ఏముందంటే? 'నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నా.
జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేసాను. ఇప్పుడు నా కోసం సమయం కేటాయించాలనిపిస్తుంది. నన్ను నేను తెలు సుకోవడానికి సమయం కావాలి' అని రాసు కొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నెటి జనులు రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నటన నుంచి కొన్ని రోజులు విరామం తీసుకోవాలనుకుంటు న్నారా? అని ఓ నెటి జనుడు అడగగా...కొత్త అభిషేక్ ను చూపించడం కోసమే అంటూ మరకొంత మంది పోస్టులు పెట్టారు. మరి ఈ పోస్ట్ వెనుక అసలు కారణం ఏంటి? అన్నది తేలాలి.
ఆ మధ్య అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యారాయ్ దూరంగా ఉంటున్నారని. విడాకులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రకాల సంకేతాలు కూడా ఈ కథనాలకు బలం చేకూర్చాయి. ఐశ్వర్యా రాయ్- కుమార్తె ఆరాధ్య ఓవైపు ఉంటే అత్తమామలు మరోవైపు ఉండటం వంటి సన్నివేశాలు పలు సందేహాలకు తావిచ్చాయి.
అటుపై కొన్ని రోజులకు అభిషేక్-ఐశ్వర్యా రాయ్ కలిసి ఉన్న కొత్త ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవ్వ డంతో ఇవన్నీ పుకార్లనీ తేలింది. తాజాగా అభిషేక్ బచ్చన్ పోస్ట్ వెనుక బలమైన కారణం ఏంటో తెలి యాలి. ఇటీవలే రిలీజ్ అయిన 'హౌస్ ఫుల్ 5' లో అభిషేక్ బచ్చన్ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది.